Railways: ఎండ తీవ్రతకు పక్కకి జరిగిపోయిన రైలు పట్టాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకంగా రైలు పట్టాలు పక్కకి జరిగిపోవడం కలకలం రేపింది. ఇది గమనించిన లోకో పైలేట్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

ఉత్తర భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏకంగా రైలు పట్టాలు పక్కకి జరిగిపోవడం కలకలం రేపింది. ఇది గమనించిన లోకో పైలేట్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లోకోపైలేట్ పట్టాలు జరిగాయన్న విషయం గుర్తించకపోయి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది తెలిపారు. వివరాల్లోకి వెళ్తే శనివారం సాయంత్రం 5.00 PM గంటల సమయంలో ఎండ తీవ్రత వల్ల లక్నో దగ్గర్లోని నిగోహన్ రైల్వేస్టేషన్‌లో రైలు పట్టాలు పక్కకు జరిగిపోయాయి.
ఆ సమయానికి నిలాంచల్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ పట్టాలు జరిగిన విషయాన్ని గమనించాడు. వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అలాగే లోకోపైలట్ లక్నో జంక్షన్‌కు చేరుకున్న వెంటనే రైల్వే అధికారులకు ఈ విషయం గురించి తెలియజేశాడు. అనంతరం నిగోహన్ రైల్వే స్టేషన్‌లోని పట్టాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.




मोदी सरकार में सवारी अपनी जान की खुद जिम्मेदार है।
लगातार रेलवे विभाग में कर्मचारियों की कमी के कारण अब रेल की पटरियां टेढ़ी हो रही हैं।
कब हादसा हो जाय ये कहा नही जा सकता।
वीडियो लखनऊ के निगोहा स्टेशन का है।? https://t.co/Nmb0tBCsGz pic.twitter.com/G5ArQHmJ9c
— MP Youth Congress (@IYCMadhya) June 18, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
