AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..

సాధారణంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి..

Viral Video: నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌.. జాగ్రత్త మేడమ్ అంటోన్న నెటిజన్లు..
Dance
Basha Shek
|

Updated on: Oct 27, 2021 | 11:16 AM

Share

సాధారణంగా గర్భం ధరించిన మహిళలు ఎంతో సున్నితంగా ఉంటారు. వీలైనంతవరకు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంటారు. అధిక బరువు, ఇతర సమస్యలతో ఒక్కోసారి చిన్న చిన్న పనులు చేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటారు. అలాంటిది నెలలు నిండిన గర్భంతో డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ మహిళ. బేబీషవర్‌ (సీమంతం) వేడుకల్లో భాగంగా శ్రీలంక ర్యాప్‌ సింగర్‌ యోహాని డిసిల్వా పాడిన ‘మాణికె మాగె హితే’ పాటకు అద్భుతంగా కాలు కదిపింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మీరు..సూపర్‌ యాక్టివ్‌ ఈ వీడియోలో కృష్ణ మాధురి అనే మహిళ పట్టుచీర, ఒంటినిండా ఆభరణాలు ధరించి తన బేబీబంప్‌ను ప్రదర్శిస్తూ డ్యాన్స్‌ చేయడం మనం చూడచ్చు. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఆమె…’ ఎట్టకేలకు నేను అనుకున్నది సాధించాను. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇలా నెలలు నిండిన సమయంలో డ్యాన్స్‌ చేయడం వల్ల గర్భిణితో పాటు కడుపులోని బిడ్డకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది’ అని రాసుకొచ్చింది. దీంతో పాటు గర్భిణులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను కూడా పంచుకుంది. ‘గర్భం ధరించడమనేది ఒక్కో మహిళకు ఒక్కో విధంగా ఉంటుంది. వ్యాయామాలు, ఎక్సర్‌సైజులు చేయడం ప్రారంభించేముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. నా విషయానికొస్తే…వైద్యపరంగా నాకెలాంటి సమస్యలు లేవు. డ్యాన్స్‌ చేసేటప్పుడు ఎంతో సౌకర్యంగా ఫీలయ్యాను. అయితే అంతకంటే ముందే కాలు కదపడానికి డాక్టర్ల అనుమతి తీసుకున్నాను’ అని పేర్కొంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘సూపర్‌ యాక్టివ్‌’, ‘రాక్‌స్టార్‌’ ‘లవ్లీ’ అని ప్రశంసిస్తూనే ‘జాగ్రత్తగా ఉండండి మేడమ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

Also Read:

Viral Video: అందుకే ఈ చిన్నారిని ఆనంద్‌ మహీంద్రా కూడా మెచ్చుకున్నారు..ఇంతకీ పాప ఏం చేసిందంటే…

సీమలో క్రేజీ సీన్‌.. వరదలో ఆర్టీసీ బస్సు.. కట్‌ చేస్తే..!వీడియో

Lower Berth Ticket: రైల్లో లోయ‌ర్ బెర్త్ టికెట్ క‌న్ఫమ్‌ కావాలంటే ఏం చేయాలి? ఆ ట్రిక్ ఏంటంటే.!