Viral Video: అందుకే ఈ చిన్నారిని ఆనంద్ మహీంద్రా కూడా మెచ్చుకున్నారు..ఇంతకీ పాప ఏం చేసిందంటే…
ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆలోచనాత్మక, సందేశాత్మక పోస్టులను

ప్రముఖ వ్యాపార దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆలోచనాత్మక, సందేశాత్మక పోస్టులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. వాటి ద్వారా మనకు తెలియని ఎందరో వ్యక్తులు, వారి సృజనాత్మక నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇక ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తుంటారీ బిజినెస్ టైకూన్. ఈ నేపథ్యంలో తాజాగా మరో అద్భుతమైన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా.
అవన్నీ నా తరం నాటి పాటలే.. ‘ది కాబ్స్ ఫ్యామిలీ’ షేర్ చేసిన ఈ వీడియోలో మాలి అనే చిన్నారి తండ్రితో పాటు కారులో కూర్చొని ప్రయాణిస్తుంటుంది. తండ్రి డ్రైవ్ చేస్తుంటే పాప మాత్రం కూనిరాగాలు తీస్తుంటుంది. అదే సమయంలో మైఖెల్ జాక్సన్, జేమ్స్ బ్రౌన్, ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ల సాంగ్స్ ప్లే చేయమని తండ్రిని అడుగుతుంది. కూతురి కోరిక మేరకు అవే పాటలు పెడతాడు తండ్రి. మ్యూజిక్ ప్లేయర్‌లో పాటలు మొదలుకాగానే చిన్నారి కూడా పెదాలు కదుపుతూ గొంతు కలుపుతుంది. డ్యాన్స్ చేయడం కూడా ప్రారంభిస్తుంది. ఈ సందర్భంలో పాప ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్లు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఆనంద్ మహీంద్రా కూడా ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ ‘నా ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేస్తోన్న మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో ఇది. హే మాలి… సంగీతంలో నీకు అద్భుతమైన అభిరుచి ఉంది. ఎందుకంటే నువ్వు అడిగిన పాటలన్నీ నా తరం నాటివే’ అని రాసుకొచ్చారు. మరి మహీంద్రాను మెప్పించిన ఈ చిన్నారి వీడియోను మీరు కూడా చూసేయండి.
This is probably the most entertaining & heartwarming handle I follow. No clue why they were suspended for a while. Welcome back! And hey Mali, you have brilliant taste in music—because those are all hits from MY generation…? https://t.co/MnIesuDcC0
— anand mahindra (@anandmahindra) October 26, 2021
Also Read:
Viral Video: ఐదేళ్ల చిన్నారి అమేజింగ్ ఆర్ట్.. పాపకు మంచి ఫ్యూచర్ ఉందంటోన్న నెటిజన్లు..
లేడి కానిస్టేబుల్ స్టన్నింగ్ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో
Viral Video: వీడికి భూమ్మీద నూకలున్నాయ్.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసేవి..! వీడియో
