AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఐదేళ్ల చిన్నారి అమేజింగ్‌ ఆర్ట్‌.. పాపకు మంచి ఫ్యూచర్‌ ఉందంటోన్న నెటిజన్లు..

'పిట్ట కొంచెం కూత ఘనం' అన్న సామెతను నిజం చేస్తూ ఇటీవల చాలామంది పిల్లలు అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వివిధ...

Viral Video: ఐదేళ్ల చిన్నారి అమేజింగ్‌ ఆర్ట్‌.. పాపకు మంచి ఫ్యూచర్‌ ఉందంటోన్న నెటిజన్లు..
Basha Shek
|

Updated on: Oct 27, 2021 | 9:42 AM

Share

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతను నిజం చేస్తూ ఇటీవల చాలామంది పిల్లలు అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లో తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఈ కోవకే చెందుతుంది ఈ ఐదేళ్ల పాప. పలకా, బలపం పట్టుకోవాల్సిన ఈ చిన్నారి కుంచె పట్టుకుని కాన్వాస్‌పై చిత్రాలు గీస్తోంది. తన అద్భుతమైన పెయింటింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ఓ పెద్ద కాన్వాస్‌పై పాప పెయింటింగ్‌ వేస్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల మంది నెటిజన్లు చిన్నారి ప్రతిభను మెచ్చుకుంటూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాపకు మంచి భవిష్యత్‌ ఉంది.. సాధారణంగా పిల్లలు కుదరుగా ఉండరు. ఏ పనిపైనా 2, 3 నిమిషాలకు మించి దృష్టి నిలపరు. అలాంటిది ఈ పాప ఎంతో ఓపికతో బొమ్మలు గీస్తోంది. వీడియో ప్రారంభంలో చిన్నారి మామూలుగానే తన పెయింటింగ్‌ ప్రారంభించినా, ఎండ్‌లో మాత్రం మన ముందు ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రతిభే నెటిజన్లను మెప్పిస్తోంది. ‘అంత పెద్ద కాన్వాస్‌పై నిర్విరామంగా పెయింటింగ్‌ వేయడం నిజంగా అద్భుతం’, ‘అమేజింగ్‌ ఆర్ట్‌…పాపకు మంచి భవిష్యత్‌ ఉంది’, అని తన వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్‌ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:

లేడి కానిస్టేబుల్‌ స్టన్నింగ్‌ రెస్క్యూ. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. వీడియో

Viral Video:పెళ్లికొడుకును వదిలి.. పెంపుడు కుక్కతో పెళ్లి కూతురు ఫోటోలు..

ఈ పామును పట్టడానికి ఇంగ్లండ్‌ నుంచి వచ్చారట.. ఎందుకో తెలుసా..??