Viral: పోర్న్ వీడియోలు చూస్తుండగా.. సడన్‌గా వచ్చిన Notification.. ఓపెన్ చేయగా దెబ్బకు ఫ్యూజులౌట్!
స్మార్ట్‌ఫోన్ వచ్చిన దగ్గర నుంచి సైబర్ నేరస్తులు తెగ స్మార్ట్ అయిపోయారు. క్రియేటివిటీగా ఆలోచిస్తూ మూడో కంటికి..
స్మార్ట్‌ఫోన్ వచ్చిన దగ్గర నుంచి సైబర్ నేరస్తులు తెగ స్మార్ట్ అయిపోయారు. క్రియేటివిటీగా ఆలోచిస్తూ మూడో కంటికి తెలియకుండా బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టేస్తున్నారు. తాజాగా ఢిల్లీని అడ్డాగా చేసుకున్న ఓ ముఠా.. ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూసేవారిని టార్గెట్‌గా చేసుకుని తమ దండాను కొనసాగిస్తున్నారు. వారిని పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని గురుగ్రామ్‌లో 18 మంది బాలురు, 4 బాలికలు ఓ గ్రూప్‌గా ఏర్పడి నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నవారిని.. వీరు టార్గెట్‌గా ఎంచుకున్నారు. వారంతా అశ్లీల వీడియోలు చూస్తున్న సమయంలో ఓ pop up notificationను పంపించేవారు. ‘మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీకైంది. వాటిని భద్రంగా ఉంచాలంటే.. ఈ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ డౌన్ లోడ్ చేసుకోవాలి’ అని అందులో పేర్కొని ఉంటుంది. అనంతరం యువతులతో సదరు వ్యక్తుల ఫోన్ నెంబర్లకు కాల్ చేయించి.. అదనపు ఛార్జీల రూపంలో డబ్బులు దోచుకునేవారు.
కాగా, గురుగ్రామ్ సమీపంలో ఈ నకిలీ కాల్ సెంటర్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. కాల్ సెంటర్ ఆపరేటర్‌తో సహా 22 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.