England Old Man: అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకిన 60ఏళ్ల వృద్ధుడు.. తీరా చూస్తే.. నవ్వులే నవ్వులు

England Old Man: తమ కనుల ముందు ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారంటే.. వెంటనే వారిని కాపాడడానికి ఎంత కష్టమైనా పడతారు. అయితే అలా కాపాడేందుకు వెళ్లి చేసిన సాహసం నవ్వులు పుట్టిస్తే..

England Old Man: అమ్మాయి కోసం హీరోలా సముద్రంలోకి దూకిన 60ఏళ్ల వృద్ధుడు.. తీరా చూస్తే.. నవ్వులే నవ్వులు
Chris Ford England
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 12, 2022 | 6:51 PM

England Old Man: తమ కనుల ముందు ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారంటే.. వెంటనే వారిని కాపాడడానికి ఎంత కష్టమైనా పడతారు. అయితే అలా కాపాడేందుకు వెళ్లి చేసిన సాహసం నవ్వులు పుట్టిస్తే.. సముద్రంలో కొట్టుకుపోతున్న అమ్మాయిని కాపాడాలని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకేశాడు. భార్య పక్కన ఉండగానే తనను వదిలి ఎవరో అమ్మాయి కోసం ఈ సాహసానికి పూనుకున్నాడు అతడు. అంత కష్టపడి ఆ అమ్మాయిని రక్షించాలని దగ్గరకు వెళ్లి షాకయ్యాడు. అసలేం జరిగిందంటే.. పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన 67 ఏళ్ల వ్యక్తి తన భార్యతో కలిసి సముద్రం ఒడ్డున కాసేపు గడిపేందుకు వచ్చాడు. అలా సముద్రం ఒడ్డున నడుస్తున్న వారికి దూరంగా రెండు తెల్లటి చేతులు నీటిపై తేలుతూ కనిపించాయి. నో డౌట్​.. ఎవరో అమ్మాయే అది అనుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయిని ఎలాగైనా కాపాడాలని భావించి, భార్య పక్కన ఉందనే విషయం మరిచిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి దభేల్​ మని నీళ్లలోకి దూకేసాడు. తీరా ఈదుకుంటూ దగ్గరికి వెళ్లి చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయాయట ఆ పెద్దాయనకు. ఇంతకీ అది ఒక బొమ్మ అట. అది అలాంటి ఇలాంటి బొమ్మ కాదు. తల లేని సె* టాయ్​. అది చూడగానే ఆయన నోట మాట పడిపోయిందట. ఇంకేంచేస్తాడు.. కష్టపడి ఈదుకుంటూ వచ్చాడు కదా… ఆ బొమ్మను లాక్కుంటూ బయటకు తీసుకొచ్చాడు. హీరోలా వెళ్లి.. అలాంటి బొమ్మతో ఒడ్డుకు వచ్చిన భర్తను చూసి ఆ భార్య కింద పడి దొర్లుకుంటూ నవ్వుకుందట. పరువు పోయిందనుకుంటూనే.. ఆ సరదా విషయాన్ని ఆయన తన బ్లాగ్​లో పంచుకున్నాడు.

పైగా ఎవరో తనలాంటి భార్యా బాధితుడే ఇలాంటి పని చేసి ఉంటాడని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అది బోట్లు ఎక్కువగా తిరిగే ఏరియా. బహుశా ఎవరైనా బోటులో వచ్చి పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంగ్లండ్​ డోర్​సెట్​ చెసిల్​ తీరం వెంట జరిగిన ఈ ఘటన.. సోషల్​ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

Also Read:   మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన భక్తురాలు