Viral News: ద్యావుడా.. ఇలా కూడా ఉంటారా ?.. పెళ్లికి వచ్చే అతిథులకు వధువు షాకింగ్ రూల్స్.. బ్రేక్ చేస్తే అంతే ఇక..
పెళ్లి .. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకను బంధువులు.. స్నేహితులు.. సన్నిహితుల మధ్య ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలని అనుకుంటారు.
పెళ్లి .. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకను బంధువులు.. స్నేహితులు.. సన్నిహితుల మధ్య ఎంతో గ్రాండ్గా జరుపుకోవాలని అనుకుంటారు. తమ పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా ఉండాలని అనుకుంటారు. అందుకే తమ పెళ్లి విషయంలో నూతన వధువరులు.. వారి కుటుంబసభ్యులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా.. పెళ్లికి వచ్చిన బంధువులకు.. స్నేహితులకు చిన్న అసౌకర్యం కలగకూడదని.. వివాహని వచ్చిన వారు తమను మనస్పూర్తిగా ఆశీర్వదించి.. ఆనందంగా తిరిగి వెళ్లాలని భావిస్తారు. కానీ ఓ వధువు మాత్రం తన పెళ్లికి వచ్చే అతిథుల కోసం షాకింగ్ రూల్స్ విధించింది. ఒకవేళ ఆ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే వారికి దారుణమైన శిక్షలు విధించనున్నట్లుగా ముందే అనౌన్స్ చేసింది. ఇంతకీ ఎవరా వధువు.. ఏంటా రూల్స్ అని ఆలోచిస్తున్నారా ?.. అయితే ఈ కథనం చదవాల్సిందే.
న్యూస్ ట్రక్ లైవ్ అనే నివేదిక ప్రకారం ఓ పెళ్లి కూతురు తన పెళ్లికి వచ్చే అతిథుల కోసం షాకింగ్ రూల్స్ విధించింది. అందులో మొదటిది.. అతిథులు పెళ్లికి తమ పిల్లలను తీసుకురాకూడదు. ఒకవేళ పిల్లలను ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటే.. వారిని తమ వెంటే ఉంచుకోవాలి. క్షణం కూడా తమ పిల్లలను విడిచిపెట్టకూడదు. అలాగే.. పెళ్లికి వచ్చే అతిథులు ఒక్కరు కూడా తెల్లని దుస్తులు ధరించకూడదు. ఎందుకంటే.. తను ధరించే బ్రైడల్ డ్రెస్ కూడా తెల్లనిదే కావడం వలన అతిథులేవరు తెల్లటి దుస్తులు ధరించకూడదని చెప్పింది. ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే వారిపై రెడ్ వైన్ బాటిల్ మొత్తం పోస్తామని ముందుగానే సూచించింది.
అలాగే.. మద్యం సేవించేవారు తన పెళ్ళికి రావొద్దని చెప్పింది. అంతేకాకుండా.. పెళ్లికి పిలవడం మర్చిపోయి ఉంటే.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తన వివాహనికి రావొద్దని చెప్పింది. వధువు పెట్టిన ఈ రూల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రూల్స్ చూసిన వారు వివాహనికి వెళ్లకపోవడమే మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి కూతురు ఎవరు.. ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు.
Also Read: Sudheer Babu: కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించిన సుధీర్ బాబు.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్..
Meenakshi Chaudhary: వరుస అవకాశాలు అందుకుంటున్న హర్యానా బ్యూటీ “మీనాక్షి చౌదరి”..(ఫొటోస్)
Keerthy Suresh : మహేష్ సినిమాకోసం ఈ ముద్దుగుమ్మ మొదటిసారి అలా కనిపించనుందట..