పాము, డేగల మధ్య పోరు ఎలా ఉంటుందో చూశారా.? డేగను పాము చూట్టేస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే.. వైరల్‌ వీడియో.

పాము, డేగల మధ్య పోరు ఎలా ఉంటుందో చూశారా.? డేగను పాము చూట్టేస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే.. వైరల్‌ వీడియో.
Viral Video

Viral Video: పాము, ముంగిసల పగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు ఒక చోట కలిశాయంటే రచ్చ మాములుగా ఉండదు. ఒకదానిపై మరొకటి దాడి భీకరంగా ఉంటుంది. అలాగే పాము, డేగల మధ్య కూడా...

Narender Vaitla

|

Feb 12, 2022 | 5:46 PM

Viral Video: పాము, ముంగిసల పగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు ఒక చోట కలిశాయంటే రచ్చ మాములుగా ఉండదు. ఒకదానిపై మరొకటి దాడి భీకరంగా ఉంటుంది. అలాగే పాము, డేగల మధ్య కూడా పోరు మాములుగా ఉండదు. గాలిలో ఎగిరే డేగ నేలపై వెళ్లే పాములను టార్గెట్‌ చేస్తుంటుంది. అయితే పాములు ఏమైనా తక్కువ తింటాయా, డేగ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటాయి. ఈ రెండింటి మధ్య జరిగే దాడిని ఎప్పుడైనా చూశారా.? అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను చూడాల్సిందే..

వివరాల్లోకి వెళితే ఓ పాము నేలపై వెళుతోంది. అదే సమయంలో ఆకాశంలో విహరిస్తున్న ఓ డేగ దృష్టి ఆ పాముపై పడింది. దీంతో వెంటనే నేలపైకి వచ్చి పామును పొడవాలని ప్రయత్నించింది. వెంటనే అలర్ట్‌ అయిన పాము ఒక్కసారిగా డేగను చుట్టేసింది. ‘నన్నే పొడుస్తావా’ అన్నట్లు పామును గట్టిగా చుట్టేసి కదలకుండా చేసేసింది. ఆ సమయంలో అక్కడి నుంచి వెళుతోన్న ఓ వ్యక్తి దీనిని గమనించాడు. డేగను పాము ఎంతకీ వదలకపోవడంతో స్వయంగా అతనే చేతితో పామును వేరు చేశాడు. కానీ పాము పట్టిన పట్టు అంత సులువగా వీడలేదు.

అయితే ఎట్టకేలకు చివరికి పామును పక్షి నుంచి వేరు చేశాడు. దీంతో ప్రాణాలు దక్కాయని ఒక్కసారిగా సంతోషించిన డేగ తుర్రుమని అక్కడి నుంచి ఎగిరిపోయింది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పాము పట్టు పడితే ఇలా ఉంటుందా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…

View this post on Instagram

A post shared by wildlife (@wildfol_)

Also Read: Manchu Lakshmi: ఎట్టకేలకు నెరవేరబోతున్న మంచు లక్ష్మీ కల.. ఈరోజు కోసం ఎదురుచూస్తున్నానంటూ..

TSCAB Recruitment: తెలంగాణ స్టేట్‌ కోఆపరేటివ్‌ ఎపెక్స్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

Medaram Jatara 2022: గిట్ల కూడా అమ్ముతరా?.. మేడారంలో వింత ఘటన.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu