Viral Video: అమ్మాయి అందానికి నెమలి ప్లాట్..హొయలు ఒలికిస్తూ పురివిప్పి నాట్యం.. వీడియో వైరల్..
Viral Video: అందమైన అమ్మాయి చేసే నాట్యం నెమలి(Peacock) నాట్యంతో పోలుస్తారు. కవులతే.. నెమలికి నేర్పిన నడకలవి.. అంటూ కీర్తిస్తారు.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో దర్శనం ఇస్తుంది..
Viral Video: అందమైన అమ్మాయి చేసే నాట్యం నెమలి(Peacock) నాట్యంతో పోలుస్తారు. కవులతే.. నెమలికి నేర్పిన నడకలవి.. అంటూ కీర్తిస్తారు.. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media)లో దర్శనం ఇస్తుంది. ఆనందం పంచడంలో సోషల్ మీడియాకు తిరుగులేదు. ప్రతినిత్యం రకరకాల వీడియోలు, ఫొటోలు నెటిజన్లను అలరిస్తాయి. కొన్ని వీడియోలు నెటిజన్ల హృదయాలు దోచుకుంటాయి. ఇక నెమలి పురివిప్పి నాట్యం చేస్తే నయన మనోహరంగా ఉంటుంది కదా. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది నెటిజన్లను ఆ వీడియో విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో ఓ యువతి ఓ పార్కులో కూర్చుని ఉంది. ఆమె దగ్గర ఐస్ క్రీమ్ లాంటి ఏదో తినే పదార్థం ఉంది. అది చూసిన నెమలి… దాని కోసం ఆమె దగ్గరకు వచ్చింది.
దాంతో ఆ యువతి నెమలిని ముట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే నెమలి ఆమెకు దూరంగా జరిగింది. ఆ యువతి అయ్యో అని నిరాశ పడుతున్న సమయంలో ఆ నెమలి సడెన్ గా పురివిప్పి ఆమెవైపు తిరిగి నాట్యం చేసింది. అది చూసిన ఆ యువతి ఎంతో ఆనందపడిపోయింది. తన కోసమే ఆ మయూరి పురివిప్పి నాట్యం చేసినట్లు ఆ యువతి ఫీలైంది. టిక్ టాక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోని ట్విట్టర్ లో అకౌంట్ లో ఫిబ్రవరి 4న రీ పోస్ట్ చేశారు. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షల మంది నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతున్నారు. వేలల్లో లైక్స్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Peacock showing off.. pic.twitter.com/nFFSpwHscS
— Buitengebieden (@buitengebieden_) February 3, 2022
Also Read: మేడారం భక్తులకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే అమ్మవారి ప్రసాదం.. ఎప్పటి నుంచి అందుబాటులోకి అంటే..