మత్స్యకారుడి వలలో అరుదైన చేపలు..! రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.. ఎలాగో తెలుసుకోండి..

Palghar Fisherman: చేపల వేటతో మత్స్యకారుల జీవితం కొనసాగుతుంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్లు సముద్రం దగ్గరే గడుపుతారు.

మత్స్యకారుడి వలలో అరుదైన చేపలు..! రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.. ఎలాగో తెలుసుకోండి..
Ghol Fish

Palghar Fisherman: చేపల వేటతో మత్స్యకారుల జీవితం కొనసాగుతుంది. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్లు సముద్రం దగ్గరే గడుపుతారు. ఒక్కోసారి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. మిలియనీర్లు అయ్యే అవకాశం లభిస్తుంది. తాజాగా ముంబై పక్కనే ఉన్న పాల్ఘర్ జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడికి కలలో కూడా ఊహించని జాక్‌పాట్ తగిలింది. చేపలు అమ్మడం ద్వారా రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడు.

వర్షాకాలంలో చేపల వేటపై నిషేధం ఎత్తివేసిన తర్వాత పాల్ఘర్ జిల్లా ముర్బే గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అతడి వలలో చాలా బరువు ఉండటం గమనించాడు. చాలామంది కలిసి వలను ఒడ్డుకు చేర్చారు. అప్పుడు అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వలలో దాదాపు 150 ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ చేపలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ఈ చేపలను చూసి అందరూ ఆనందంతో గంతులు వేశారు.

ఈ చేపలను వేలం వేస్తే దాదాపు రూ.1 కోటి 33 లక్షల బిడ్ వచ్చింది. ఈ చేపలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే వీటికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ఒక్కో చేప ధర వేలల్లో ఉంటుంది. కొంతమంది వీటిని బంగారు గుండె కలిగిన చేపలు అని కూడా పిలుస్తారు. ఈ చేపల కారణంగా చంద్రకాంత్ లక్షాధికారి కావడం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా మంది అరుదైన చేపలను కనుగొన్నారు. వీటిని మార్కెట్‌లో చాలా ఎక్కువ ధరకు విక్రయిస్తారు. ఇటువంటి చేపల వల్ల చాలా మంది మత్స్యకారులు మిలియనీర్లు అయ్యారు.

ఇదిలా ఉంటే.. విశాఖపట్టణంలో ఇటీవల ఓ వింత చేప జాలరికి చిక్కింది. దీని పేరు పోమాకాట్స్. ఏంజెల్‌ చేప అని కూడా పిలుస్తారు. ఆకట్టుకునే రంగు, రూపం దీని సొంతం. ఇది సముద్రంలోని పగడపు దిబ్బల్లో ఉంటుందట. ఇటువంటి చేపలు ఏడాదికి ఒక్కటైనా చిక్కడం కష్టమేనన్నది మత్స్యకారుల మాట. అయిదు కిలోల బరువు వరకు ఉంటుందని అంటున్నారు. పగడపు దిబ్బల్లో ఈ చేప చిక్కడం మత్స్యకారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇలాంటి చేపలను ఎక్కువగా ఇళ్లలోని అక్వేరియంలో పెంచికుంటూ ఉంటారు.

GST: వరుసగా రెండో నెలలోనూ అదిరిపోయిన జీఎస్టీ ఆదాయం.. గతేడాదిని మించి వసూళ్లు!

Tollywood drugs case Video: పక్కా ప్లాన్ తో ఈడీ.. మిగతా సెలబ్రిటీల పరిస్థితి ఏంటి..?(వీడియో).

Priyanka Chopra: భయంతో కన్నీళ్ళు పెట్టుకున్న ప్రియాంక చోప్రా.. కారణం ఏంటో తెలుసా..?

Click on your DTH Provider to Add TV9 Telugu