కుక్కల ఆత్మహత్యలు.. ఈ వంతెనపైకి రాగానే పై నుంచి దూకేస్తున్నాయి.. అంతుబట్టని మిస్టరీ..

కుక్కల ఆత్మహత్యలు.. ఈ వంతెనపైకి రాగానే పై నుంచి దూకేస్తున్నాయి.. అంతుబట్టని మిస్టరీ..
Dog Suicide

Dog Suicide: ప్రపంచంలో నిత్యం ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మొదట ఒత్తిడికి

uppula Raju

|

Jan 18, 2022 | 9:01 PM

Dog Suicide: ప్రపంచంలో నిత్యం ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మొదట ఒత్తిడికి గురై తర్వాత డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో మనుషులను తన గుప్పిట్లోకి తీసుకునే కంటికి కనిపించని వ్యాధి ఏదైనా ఉందంటే అది ఆత్మహత్యే అని చెప్పొచ్చు! మనుషుల ఆత్మహత్యల గురించి మీరు చాలా వినే ఉంటారు కానీ జంతువుల ఆత్మహత్యల గురించి ఎప్పుడైనా విన్నారా.. అవును జంతువులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయి. ఈ రోజు మనం కుక్కల ఆత్మహత్యలకు సంబంధించిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం.

స్కాట్లాండ్‌లోని ఓవర్‌టన్ బ్రిడ్జ్ నుంచి దూకి కుక్కలు వరుసగా ఆత్మహత్య చేసుకుంటున్నాయి. 50 అడుగుల ఎత్తున్న ఈ బ్రిడ్జిపై మొదటగా కుక్కలు నడుచుకుంటూ వెళుతూ హఠాత్తుగా పై నుంచి దూకి చనిపోతున్నాయి. అందుకే ఈ వంతెనకు సూసైడ్‌ డాగ్‌ బ్రిడ్జి అని పేరు పెట్టారు. అయితే కుక్కలు వాటికవే పై నుంచి దూకడానికి కారణాలు ఏంటో ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ బ్రిడ్జిపై ఇలాంటి ఘటనలు ఎక్కువ కావడంతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వంతెనపై నోటీసు బోర్డు కూడా పెట్టారు. ఆంగ్ల వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురించిన వార్తల ప్రకారం.. వందలాది కుక్కలు ఈ వంతెనపై నుంచి దూకాయి, వాటిలో 50 మరణించాయి. అయితే ఈ బ్రిడ్జి వెనుక మిస్టరీ మాత్రం ఇంకా తెలియడం లేదు.

అయితే ఈ రహస్య వంతెన 1950 సంవత్సరంలో నిర్మించారు. ఈ ప్రదేశంలో దెయ్యాలు, ప్రతికూల శక్తులు ఉన్నాయని కొంతమంది నమ్ముతారు. మరికొందరు కుక్కలని దెయ్యాలు ఆవహిస్తున్నాయని, దీంతో అవి వంతెనపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే భర్త మరణించిన తర్వాత ఒక మహిళ 30 ఏళ్ల పాటు ఇక్కడ ఒంటరిగా నివసించిందని తెలిసింది. ఆ లేడీ ఆత్మకు ఈ వంతెన నిలయమని స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా ఓ వ్యక్తి తన కొడుకును ఈ వంతెనపై నుంచి కిందకు తోసేసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. నేటికీ ఈ వంతెన ఒక పజిల్‌గా మిగిలిపోయింది. కుక్కల ఆత్మహత్యల రహస్యం నేటికీ అలాగే ఉంది.

Sleep: బెడ్‌పై ఎప్పుడు ఆ స్థితిలో నిద్రించవద్దు.. పడుకునే పద్దతుల గురించి తెలుసుకోండి..?

కాకి తలపై తన్నిందా.. బయటికి వెళ్లేముందు పిల్లి ఎదురైందా.. శకున శాస్త్రం ఏం చెబుతుందంటే..?

Decoction: ఈ వ్యక్తులు కషాయాలు అస్సలు తాగకూడదు.. ఆరోగ్యానికి చాలా హానికరం..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu