Optical illusion: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోపై ఓ లుక్కేయండి..

చెప్పడమే కాదు కొన్ని రకాల ఫొటోలతో మనిషి ఎలా ఆలోచిస్తాడో చెబుతుంటారు కూడా. అయితే ఒకప్పుడు కేవలం కొందరికే తెలిసిన ఇలాంటి విషయాలు సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికి తెలుస్తున్నాయి. ఎన్నో ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది...

Optical illusion: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోపై ఓ లుక్కేయండి..
Optical Illusion
Follow us

|

Updated on: Dec 30, 2023 | 12:45 PM

ఆప్టికల్ ఇల్యూజన్స్‌ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మనుషుల ఆలోచనలను అంచనా వేసే కొన్ని ఫొటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫొటోల ఆధారంగా ఆలోచనలను ఎలా అంచనా వేయొచ్చని అనుకుంటున్నారు కదూ. కానీ మానసిక నిపుణులు మాత్రం ఇది నిజమేనని చెబుతున్నారు.

చెప్పడమే కాదు కొన్ని రకాల ఫొటోలతో మనిషి ఎలా ఆలోచిస్తాడో చెబుతుంటారు కూడా. అయితే ఒకప్పుడు కేవలం కొందరికే తెలిసిన ఇలాంటి విషయాలు సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరికి తెలుస్తున్నాయి. ఎన్నో ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెటిజన్లలో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Optical Illusion

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే సాధారణంగానే కాస్త విచిత్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది కదూ! తీక్షణంగా చూస్తే అందులో రెండు గుర్రాలు, ఒక స్త్రీ బొమ్మతో పాటు మరింత తీక్షణంగా వీక్షిస్తే పక్షి, పర్వతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫొటో చూడగానే తొలుత ఏం కనిపిస్తుంది అన్నదాన్నిబట్టి మీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. వీటి ప్రకారం..

* మీకు ఒకవేళ ఈ ఫొటో చూడగానే రెండు గుర్రాలు కనిపిస్తే.. ది మైండ్‌ జర్నల్‌ ప్రకారం, మీరు నిజమైన ప్రేమను వెతికే ఆలోచనలో ఉన్నారని అర్థం. అలాగే మీరు చాలా ఓపికతో ఉంటారని, జీవితంపై ఆశాజనకంగా ఉంటారని అర్థం.

* ఇక మీరు ఫొటో చూడగానే మీకు పక్షులు, పర్వతాలు కనిపిస్తే.. మీరు మీ కంటే ఎక్కువగా ఇతరులపై గురించి శ్రద్ధ వహిస్తారని అర్థం. ఇతరులు విజయం సాధించడానికి సహాయం అందిస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. మీ ఆనందం, లక్ష్యాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని అర్థం.

* ఒకవేళ ఈ ఫొటో చూడగానే మీకు స్త్రీ ముఖం కనిపిస్తే.. మీరు ఇతరులపై సానుభూతిని చూపించే వ్యక్తిత్వం కలవారని అర్థం. మీరు జీవతంపై సానుకూల దృక్పథంతో ఉంటారు. మీ జీవితాన్ని వేరే వారు నియంత్రించడాన్ని మీరు ఇష్టపడరు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వాళ్లను కూడా వదిలే సమస్యే లేదంటున్న నాని..
వాళ్లను కూడా వదిలే సమస్యే లేదంటున్న నాని..
ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే
ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి
ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారనున్న వైసీపీ నేతలు..?
ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారనున్న వైసీపీ నేతలు..?
పాలసీ ఏదైనా.. జనాలకు కావాలి క్యాష్‌లెస్‌.. కారణమేమిటంటే..
పాలసీ ఏదైనా.. జనాలకు కావాలి క్యాష్‌లెస్‌.. కారణమేమిటంటే..
ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు..
ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు..
ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం..కుటుంబాన్ని కాపాడిన కొడుకు
ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం..కుటుంబాన్ని కాపాడిన కొడుకు
ఫ్లిప్‌కార్ట్ నుంచి యూపీఐ సేవలు.. సూపర్‌ మనీ పేరుతో యాప్‌
ఫ్లిప్‌కార్ట్ నుంచి యూపీఐ సేవలు.. సూపర్‌ మనీ పేరుతో యాప్‌
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉన్నారా? కష్టాలు తప్పవు..
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉన్నారా? కష్టాలు తప్పవు..
టాలీవుడ్‌లో దర్శకులకు పెరిగిన ప్రెషర్.. ఆ సినిమాలే వాళ్ళకు దిక్కు
టాలీవుడ్‌లో దర్శకులకు పెరిగిన ప్రెషర్.. ఆ సినిమాలే వాళ్ళకు దిక్కు