Viral Video: ఈ కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.. వైరల్ వీడియో.
ఇక కొన్ని సందర్భాల్లో కుక్కలు చేసే పనులు చూస్తుంటే.. మనుషులు కూడా బలాదూర్ అనాల్సిందే. అంతలా తెలివిని ప్రదర్శిస్తుంటాయి. అచ్చంగా మనుషుల్లాగే పనులు చేస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే నిజంగానే శునకాలకు ఇంత తెలివి ఉంటుందా.? అనిపించకమానదు. ఇంతకీ ఆ శునకం చేసిన పని ఏంటి.? అంతలా ఆశ్చర్యపడే విషయం ఏంటనేగా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. అందుకే చాలా మంది ఇంట్లో శునకాలను పెంచుకుంటారు. యజమానుల పట్ల ఎంతో ప్రేమతో వ్యవహరించే జంతువుల్లో శునకాలు ముందు వరుసలో ఉంటాయి. అంతేకాకుండా శునకాలు తమ యజమానుల పట్ల నిబద్ధతతో ఉంటాయి. యజమాని చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తాయి. అందుకే శునకాలను కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తుంటారు.
ఇక కొన్ని సందర్భాల్లో కుక్కలు చేసే పనులు చూస్తుంటే.. మనుషులు కూడా బలాదూర్ అనాల్సిందే. అంతలా తెలివిని ప్రదర్శిస్తుంటాయి. అచ్చంగా మనుషుల్లాగే పనులు చేస్తుంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే నిజంగానే శునకాలకు ఇంత తెలివి ఉంటుందా.? అనిపించకమానదు. ఇంతకీ ఆ శునకం చేసిన పని ఏంటి.? అంతలా ఆశ్చర్యపడే విషయం ఏంటనేగా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఓ యజమాని తన పెంపుడు శునకానికి చిన్న బాస్కెట్ ఇచ్చి మార్కెట్‌కు పంపించాడు. చకచక మార్కెట్‌కు వెళ్లిన సదరు శునకం అక్కడ కూరగాయలు అమ్ముతున్న మహిళల దగ్గరకు వెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న కూరగాయాల్లో యజమాని చెప్పిన వాటిని చూపించి వాటిని కొనుగొలు చేసింది. కూరగాయలు విక్రయిస్తున్న మహిళలు బాస్కెట్‌లో ఉన్న డబ్బులు తీసుకొని శునకానికి కూరగాయలు అందించారు. దీంతో తిరిగి బాస్కెట్‌ను తీసుకున్న శునకం అక్కడి నుంచి మళ్లీ యజమానికి ఇంటికి పరుగులు పెట్టింది.
శునకం వైరల్ వీడియో..
View this post on Instagram
ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. శునకం తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ కామెట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే ఇలాంటి శునకాన్ని పెంచుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..