Puzzle: ఈ పజిల్ కూడా సాల్వ్ చేయలేరా ఏంటి..? బల్బ్ మీకు కనపడిందా..?
వచ్చేశాం.. మీ కోసం ఖతార్నాక్ పజిల్ తెచ్చేశాం.. సోషల్ మీడియాలో రీల్స్ చూసి.. చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌ను ఓ పట్టు పట్టేయండి. ఇది మీ మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో తెలియజేస్తుంది. మీ దిమాక్ సోచ్ ఎలా ఉందో.. వివరిస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం.....

ఆప్టికల్ ఇల్యూజన్స్ అనేవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మన బుర్రకు మేత వేసే ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసేందుకు నెటిజన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వీటిని అందించేందుకు సోషల్ మీడియాలో రకరకాల పేజీలు కూడా పనిచేస్తున్నాయి. ఆత్మ విశ్వాసం కలవారు ఈ పజిల్స్ అంతు తేల్చేవరకు వదిలిపెట్టరు. పజిల్స్‌లో ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ పంథా వేరుగా ఉంటుంది. ఇవి మన కళ్లను మోసం చేస్తారు. బుర్రను హీటెక్కిస్తాయి. సమాధానం చిక్కినట్లే ఉంటుంది. అంతలోనే మాయం అవుతుంది. మరి ముఖ్యంగా ఇంత సమయంలో వీటిని సాల్వ్ చేయాలని అని టైమ్ లిమిట్ పెట్టినప్పుడు మరింత కన్‌ఫ్యూజన్ ఉంటుంది.
తాజాగా మీ ముందుకు ఓ కిర్రాక్ పజిల్ తీసుకొచ్చామండోయ్. పైన మీకు కనిపిస్తున్న ఫోటోలో జపనీస్ దీపాలు ఎంతో అందంగా ఉన్నాయ్ కదా.. అయితే అందులో ఒక చోట ఓ బల్బ్ ఉంది. అది ప్రకాశవంతంగా వెలుగుతుంది. మీరు తొమ్మిది అంటే తొమ్మిది సెకన్లలో అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ మీ IQని పరీక్షించడానికి ఒక సరదా మార్గం. మీకు ఈ టాస్క్ కష్టంగా అనిపిస్తే సాయం చేసేందుకు మేమున్నాం కదా.. మీరు ఈ ఇమేజ్ రైట్ సైడ్ ఎక్కువ పోకస్ చేస్తే.. సక్సెస్ అవుతారు. ఈ చిత్రంలో దాచిన బల్బ్‌ను కేవలం 5% మంది మాత్రమే కనుగొనగలిగారు.
ఏంటి కనిపెట్టారా..? అయితే వెల్ అండ్ గుడ్ కొందరు ఇంకా కనిపెట్టలేదా..? ఏంటండీ బాబు. సరే మేమే ఆన్సర్ దిగువన ఇచ్చేస్తున్నాం. ఈసారి ఇలాంటి పజిల్స్ ఎదరైనప్పుడు మాత్రం కాస్త ఇస్మార్ట్ బుర్రతో సమాధానాలు వెతకండి. సమస్యలు ఎదురవుతాయ్.. వాటికి మనం ఎంత తెలివిగా చెక్ పెట్టామన్నదే అసలు పాయింట్. అంతే కదా.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
