Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusions: మీ పరిశీలన శక్తికి సవాల్.. ఆకులో ఆకునై అంటూ దాగున్న కుక్క..10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

కెమెరా పట్టుకున్న ప్రతి వ్యక్తి ఫోటోగ్రాఫర్ కాదు. ఎందుకంటే ఫోటోలు తీయడం ఒక కళ.. ఫోటోలు తీయడంలో మాస్టర్ అవ్వాలంటే, మీరు ఓపిక కలిగి ఉండాలి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా సరదాగా తీసే కొన్ని చిత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి.

Optical Illusions: మీ పరిశీలన శక్తికి సవాల్.. ఆకులో ఆకునై అంటూ దాగున్న కుక్క..10 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2022 | 9:27 PM

ఇంటర్నెట్‌లో చిత్రాలు అనేక రకాలుగా వైరల్ అవుతున్నప్పటికీ..  మీ మనసును పూర్తిగా ఆకర్షించే చిత్రాలు మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి చిత్రాలనే ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటాం.ఈ చిత్రాలు చూపరుల మెదడకు పదును పెడతాయి. ఒకటి కనిపిస్తే.. తరచి చూస్తే  అందులో వేరొకటి కనిపిస్తాయి.  ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలను మొదటిసారి చూసినప్పుడు చాలా సాధారణమైనదిగా అనిపిస్తుంది. అయితే దానిని తరచి చూస్తే.. అపుడు అందులో దాగున్న మరొకొన్ని వింతలు, విశేషాలు కనిపిస్తాయి.

కెమెరా పట్టుకున్న ప్రతి వ్యక్తి ఫోటోగ్రాఫర్ కాదు. ఎందుకంటే ఫోటోలు తీయడం ఒక కళ.. ఫోటోలు తీయడంలో మాస్టర్ అవ్వాలంటే, మీరు ఓపిక కలిగి ఉండాలి. అయితే కొన్నిసార్లు అనుకోకుండా సరదాగా తీసే కొన్ని చిత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. మరికొన్ని ఫోటోలు ప్రజల మనస్సును  గందరగోళానికి గురిచేస్తాయి. అలాంటి ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో ఎండు ఆకుల మధ్య దాగి ఉన్న కుక్కను కనిపెట్టాలి. ఇది పరిష్కరించడంలో  నెటిజన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు.

Optical Illusion

Optical Illusion

స్టీవ్ అనే వినియోగదారు Redditలో ఓ అందమైన పార్క్ చిత్రాన్ని షేర్ చేసారు. అక్కడ చాలా ఆకులు రాలి ఉన్నాయి. నేల మీద తివాచీలా పడి ఉన్నాయి.  వాటి మధ్యలో ఆకు రంగులో కలిసిన కుక్క కూర్చుని ఉంటుంది. అయితే ఆ కుక్కను  కనుగొనడం ప్రతి ఒక్కరికీ అంత సులభం కాదు. మీరు కూడా ఈ చిత్రంపై మీ మనస్సును లగ్నం చేసి.. సమయం వృధా చేసి అలసిపోతే, మేము మీకు ఒక చిన్న క్లూ ఇస్తున్నాం..

ఇవి కూడా చదవండి

ఆప్టికల్ భ్రమకు సమాధానం:

మీరు చిత్రాన్ని జూమ్ చేస్తే, మీరు ఖచ్చితంగా ఆకుల్లో దాగున్న కుక్కను చూస్తారు. అయితే కుక్కను కనుగొనడానికి, మీరు చిత్రం మధ్యలో దృష్టి పెట్టాలి. కుక్క శరీరం.. ఎండిన ఆకులు ఒకే రంగును కలిగి ఉన్నాయి. అందుకనే కుక్క కొంచెం కష్టపెడుతోంది. ఇప్పుడు పరిశీలిస్తే మీకు కుక్క కనిపిస్తుంది.  మీరు ఎవరికైనా సవాల్ విసరాలనుకుంటే మీరు తప్పకుండా ఈ చిత్రాన్ని షేర్ చేయండి.

Optical Illusion 1

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..