Optical Illusions: ఆకులు రాలిన చెట్టులో దాగున్న కుందేళ్లు.. మూడింటిని 5 సెకన్లలో పట్టుకోండి చూద్దాం..

ఆకులు రాలిన ఈ చెట్టుకొమ్మల్లో మూడు కుందేళ్ళను పొందుపరిచాడు కళాకారుడు. మీరు ఈ కుందేళ్ళను కనుగొని చెప్పాలి. ఈ సవాలు సామాన్యమైనది కాదు, ఎందుకంటే ఇది చూడడానికి మోడులా ఎండిన చెట్టులా కనిపిస్తుంది.

Optical Illusions: ఆకులు రాలిన చెట్టులో దాగున్న కుందేళ్లు.. మూడింటిని 5 సెకన్లలో పట్టుకోండి చూద్దాం..
Optical Illusion
Follow us

|

Updated on: Oct 07, 2022 | 11:59 AM

‘ఆప్టికల్ ఇల్యూషన్ ‘ ఉన్న చిత్రాలు మీ కళ్లను మోసగించడమే కాకుండా మీ మనసును మోసగిస్తాయి. చిత్రంలో మీరు చూస్తున్నది ఖచ్చితంగా సరైనదని మీరు భావిస్తారు. అయితే అది భ్రమ అని తర్వాత అర్ధమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో దాగున్న చిత్ర విచిత్రాలను పరిష్కరించడంలో ఆసక్తిని చూపిస్తున్నారు. ఇలాంటి పజిల్స్‌ని పరిష్కరించడంలో ఆనందిస్తున్నారు. ఈ రోజు మేము మీ కోసం అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షను తీసుకువచ్చాము. ఇది చెట్టుకు సంబంధించిన స్కెచ్. ఈ స్కెచ్‌లో మూడు కుందేళ్లు కూడా దాగి ఉన్నాయి. అయితే బుజ్జి బుజ్జి కుందేళ్లు ను 5 సెకన్లలోపు గుర్తించి.. మీ పరిశీలనా శక్తికి శభాష్ అనిపించుకోవాలి.

ఆప్టికల్ భ్రమతో ఉన్న అనేక చిత్రాలోని రహస్యాలను కనిపెట్టడంలో  99 శాతం మంది ప్రజలు విఫలమవుతారని కూడా పేర్కొన్నారు. అయితే, నేటి బ్రెయిన్ టీజర్ ఆ స్థాయిలో ఉండకపోవచ్చు.. అయినప్పటికీ చెట్టుకొమ్మలో దాగున్న కుందేలును 5 సెకన్లలో కనుగొని చెప్పడం సులభం కాదు. వైరల్ అవుతున్న ఫోటోలో.. ఆకులు రాలిన చెట్టు ఉంది. ఆకులు రాలిన ఈ చెట్టుకొమ్మల్లో మూడు కుందేళ్ళను పొందుపరిచాడు కళాకారుడు. మీరు ఈ కుందేళ్ళను కనుగొని చెప్పాలి. ఈ సవాలు సామాన్యమైనది కాదు, ఎందుకంటే ఇది చూడడానికి మోడులా ఎండిన చెట్టులా కనిపిస్తుంది. కానీ మీరు దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే.. దానిలో దాగి ఉన్న కుందేళ్ళను చూడటం ప్రారంభిస్తారు. మరి ఆలస్యమేమిటి? మీ సమయం ఇప్పుడు ప్రారంభమయింది.

మీరు కుందేలును చూసారా?

Optical Illusion 1

Optical Illusion

మీరు చిత్రంలో దాగి ఉన్న ఒక్క కుందేలును కనిపెట్టలేకపోతే.. వాటిని కనుగొనడంలో మీకు కొంచెం సహాయం చేస్తాం.. చెట్టు చుట్టూ ఉన్న కొమ్మలను జాగ్రత్తగా చూడండి.. అక్కడ ఎక్కడో ఆ మూడు కుందేళ్ళు కనిపిస్తాయి. అందుకే త్వరగా వెతకండి. ఇంకా దొరక్కపోతే ఆ ముగ్గురూ ఉన్న చిత్రంలో రెడ్ సర్కిల్‌లో ఉన్నవాటిని చూడండి..

ఇవి కూడా చదవండి

ఆ 3 కుందేళ్ళు ఇక్కడ దాక్కున్నాయి

Optical Illusion 2

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..