Viral Video: సప్తఋషి థీమ్ పార్క్‌లో రీల్స్ కోసం జంట చేసిన పనికి నెటిజన్లు ఫైర్.. అరెస్ట్ చేయాలని డిమాండ్
ఢిల్లీ మెట్రోలో ఒక జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఇద్దరూ బహిరంగంగా లిప్ కిస్ పెట్టుకున్నట్లు కనిపించింది. ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో దుమారం రేగింది. ఇప్పుడు నోయిడా సెక్టార్ 78లో ఉన్న 'వేద్ వన్' పార్క్‌లో మరో దారుణమైన పనిని చేసింది ఓ జంట. వైరల్ అవుతున్న వీడియోలో వేద్ ఫారెస్ట్ పార్క్‌లో జంట తమ ప్రేమను వ్యక్తం చేసిన విధానం చూడవచ్చు. అబ్బాయి మొదట అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంగరాన్ని పెట్టాడు. అదే సమయంలో ఆ యువతి వాటర్ బాటిల్ లోని వాటర్ తాగుతూ ఉంది.

సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఫన్నీ పనులు చేస్తూ నవ్విస్తూ ఆకట్టుకుంటారు. అదే సమయంలో కొందరు సభ్య సమాజంలో చేయరాని పనులు చేస్తూ ప్రజల ఆగ్రహానికి గురవుతారు. ఇటీవల ఢిల్లీలో మెట్రోలో యువత చేసిన పని మరిచిపోక ముందే.. ఇప్పుడు నోయిడాలోని ప్రసిద్ధ వేద్ వన్ పార్క్‌లో ఒక జంట బహిరంగంగా చేసిన పనికి ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది నోయిడా పోలీసులను ట్యాగ్ చేసి.. ఈ జంటను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రజలకు అంత కోపం వచ్చేలా ఈ జంట ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు.
ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఒక జంటకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఇద్దరూ బహిరంగంగా లిప్ కిస్ పెట్టుకున్నట్లు కనిపించింది. ఈ వీడియోపై ఇంటర్నెట్‌లో దుమారం రేగింది. ఇప్పుడు నోయిడా సెక్టార్ 78లో ఉన్న ‘వేద్ వన్’ పార్క్‌లో మరో దారుణమైన పనిని చేసింది ఓ జంట. వైరల్ అవుతున్న వీడియోలో వేద్ ఫారెస్ట్ పార్క్‌లో జంట తమ ప్రేమను వ్యక్తం చేసిన విధానం చూడవచ్చు. అబ్బాయి మొదట అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ ఉంగరాన్ని పెట్టాడు. అదే సమయంలో ఆ యువతి వాటర్ బాటిల్ లోని వాటర్ తాగుతూ ఉంది. తన వేలికి ఉంగరం పెట్టిన తర్వాత ఆ యువతి నోటి దగ్గరకు లిప్ కిస్ పెట్టడానికి యువకుడు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ యువతి తన నోటిలోని నీటిని ఆ యువకుడి నోటిలోకి ఉమ్ముతోంది. అప్పుడు ఆ యువకుడు కూడా ఆ నీటిని ఆత్రంతా అందుకుంటున్నాడు. ఈ జంట చేసిన పనికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నోయిడా పోలీసులు ఈ జంటపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ జంట వీడియోపై ఓ లుక్ వేయండి..
This is Van Ved Park, Noida which is also called vedic park because its built on the Saptrishi theme.
Insta Reelers turning this into cringe hub with all sorts of vulgarity@noidapolice should keep at least one constable here to maintain the sanctity of this park pic.twitter.com/zK3wF84wMY
— Squint Neon (@TheSquind) October 31, 2023
@TheSquind హ్యాండిల్‌లో షేర్ చేశారు. అయితే ఇన్‌స్టా రీలర్లు ఈ స్థలాన్ని కూడా అశ్లీల డెన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు.. వీడియో షేర్ చేసిన వ్యక్తి నోయిడా పోలీసులను ట్యాగ్ చేసి, పార్క్ పవిత్రతను కాపాడేందుకు కానిస్టేబుళ్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సైబర్ సెల్ సహాయంతో జంటను గుర్తిస్తున్నట్లు డీసీపీ నోయిడా తెలిపారు.
అశ్లీల పనులు చేస్తే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
బహిరంగ ప్రదేశాల్లో అశ్లీలతను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ వినియోగదారు రాశారు. అదే సమయంలో మరో వినియోగదారు ఇలాంటి వారిని అరెస్టు చేసే వరకు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారని అంటున్నారు. మరొకరు వ్రాశారు ఉంగరం ధరించిన తర్వాత నోరు కడుక్కోవడాన్ని మొదటిసారి చూశా అంటూ ఫన్నీ కామెంట్ పెట్టారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..