Viral Video: ఆ ఇంటి ముందు సీసీ కెమెరా చూసి అంతా షాక్.. కర్రతో టచ్ చేసి చూడగా
ఓ ఇంటి ముందు సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నాడు ఒక వ్యక్తి. అందరూ ఆ కెమెరాను చూసి భయపడ్డారు. లోనకి వెళ్ళడానికి డౌట్ పడ్డారు. దీంతో ఓ వ్యక్తి కొంచెం ధైర్యం చేసి.. ఆ సీసీ కెమెరాను టచ్ చేయగా.. ఆ తర్వాత.

ప్రస్తుత కాలంలో దొంగలు ఎక్కువైపోతున్నారు. ఈ క్రమంలో ఇళ్లలో చాలామంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి వల్ల దొంగల జాడమాత్రమే కాదు.. రాత్రివేళ ఇళ్లలో క్రూరమృగాలు లాంటివి ఏవైనా చొరబడుతున్నా.. ఈ సీసీ టీవీ ద్వారా తెలుసుకొని ప్రజలు అప్రమత్తమవుతున్నారు. అలా ఓ వ్యక్తి తన ఇంటిముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతోంది. సీసీ కెమెరా పెట్టుకోవడంలో వింతేముంది.. అంతగా వైరల్ అవడానికి అనుకుంటున్నారా..? వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
వీడియో ప్రకారం… ఓ వ్యక్తి తన ఇంటి ముందు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాడు. బహుసా ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువగా ఉందో.. లేక చుట్టు పక్కల వాళ్లంత సీసీ కెమెరాలు పెట్టుకున్నారు.. నా ఇంటికి లేకపోతే ఎలా అనుకున్నాడో కానీ మొత్తానికి తన ఇంటిముందు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. తన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు క్లియర్‌గా రికార్డయ్యేలా ఇంటి గుమ్మానికి పైనే సెట్ చేశాడు. ఈ క్రమంలో ఆఇంటి దగ్గరకి వెళ్లడానికి ఎవరూ సాహసించట్లేదు. అయితే ఎవరికో అనుమానం వచ్చింది. ఇది నిజంగా సీసీ కెమెరాయేనా.. అని. దాంతో ఓ కర్రతీసుకొని దానిని తట్టి చూసాడు ఆ వ్యక్తి. ఇంకేముంది నకిలీ సీసీ కెమెరా గుట్టురట్టయింది. అది నిజమైన సీసీ కెమెరా కాదు.. కార్డ్‌బోర్డ్‌తో తయారుచేసిన సీసీ కెమెరా బొమ్మ.
అచ్చం సీసీ కెమెరాను పెట్టించినట్టే పవర్ కనెక్షన్ ఇచ్చిమరీ సెట్ చేశాడు. కర్రతో నెట్టగానే ఒక్కసారిగా వంగిపోయింది. దాంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి అవాక్కయ్యాడు.. ఓర్నీ తెలివి తెల్లార.. ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు మీకు అనుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తెలివికి అంతా అవాక్కవుతున్నారు. జనాలను భలే బోల్తా కొట్టించాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ మంది పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..