AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ బాధను తట్టుకోలేక మద్యానికి బానిసైయ్యాను.. స్టార్ నటి ఓపెన్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ అమ్మ, వదిన, అత్తా పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి దదాపు 900 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఆ బాధను తట్టుకోలేక మద్యానికి బానిసైయ్యాను.. స్టార్ నటి ఓపెన్ కామెంట్స్
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2025 | 9:44 AM

గతంలో చాలా మంది హీరోయిన్స్ చేడు వ్యసనాలకు బానిసలైన విషయం తెలిసిందే. జీవితంలో ఎదురుకున్న పరిస్థుతుల కారణంగా కొంతమంది మద్యానికి బానిసలవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది డిప్రషన్ కు గురవ్వడంతో మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ హీరోయిన్. ఆమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. ఆమె స్టార్, మాత్రమే కాదు స్టార్ హీరో సతీమణి కూడా.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? అండ్ దాదాపు 900 సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె ఎవరంటే..

ఒకప్పుడు స్టార్ హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు రియల్ స్టార్ శ్రీహరి. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్న శ్రీహరి. ఇక సహాయక పాత్రల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. 1996లో శ్రీహరి డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డిస్కో శాంతి గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80వ దశకంలో ఐటం సాంగ్స్‌లో నటించి సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీతోపాటు పలు భాషల్లో దాదాపు తొమ్మిది వందలకుపైగా చిత్రాల్లో నటించారు. డిస్కో శాంతి.

‘ఉదయగీతం’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన డిస్కో శాంతి తొలినాళ్లలో సహాయ నటిగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఐటెం సాంగ్స్‌లో నర్తించే అవకాశం రావడంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దాదాపు 11 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోయారు. 1996లో తెలుగు నటుడు శ్రీహరిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ కు పరిమితమయ్యారు. లివర్ సంబంధిత వ్యాధితో నటుడు శ్రీహరి భర్త 2013 అక్టోబర్లో ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త మరణం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శ్రీహరి చనిపోయాక ఆ బాధను తట్టుకోలేకపోయానన్నారు. ఆ సమయంలో మద్యానికి బానిసయ్యి డిప్రెషన్‌లోకి వెళ్లానన్నారు. భర్త మరణం తర్వాత మూడు నెలలకు ధైర్యం తెచ్చుకుని తన పిల్లల భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడ్డానన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ మామూలు మనిషిని కాగలిగానని ఎమోషనల్ అయ్యారు డిస్కో శాంతి.

Disco Shanthi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..