AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious Place: M-ట్రయాంగిల్ ఒక రహస్యమా, అద్భుతమా, లేదా మరో ప్రపంచానికి ప్రవేశ ద్వారమా?

ప్రపంచంలో అనేక ప్రాంతాలు రహస్యాలకు నెలవు. కొన్ని ప్రాంతాలు వింతలతో నిండి ఉంటే.. మరికొన్ని భయానకంగా ఉంటాయి. కొన్ని మర్మమైన ప్రదేశాల గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రష్యాలో ఇలాంటి మర్మమైన గ్రామం ఉంది. ఈ గ్రామంలో వింతలను నేటికీ శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయారు. ఈ వింతలను శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఈ రోజు గ్రామంలో జరిగే వింతలు ఏమిటో చూద్దాం.

Mysterious Place: M-ట్రయాంగిల్ ఒక రహస్యమా, అద్భుతమా, లేదా మరో ప్రపంచానికి ప్రవేశ ద్వారమా?
Mysterious Village
Surya Kala
|

Updated on: Jul 17, 2025 | 11:58 AM

Share

కొన్ని ప్రదేశాలు వింత వింత సంఘటనలతో చాలా ప్రశ్నలను కలిగిస్తాయి. అంతేకాదు ప్రపంచంలో అనేక భయానక ప్రదేశాలు, చాలా మర్మంగా ఉండే ప్రదేశాల గురించి తరచుగా వార్తల రూపంలో తెలుస్తూనే ఉన్నాయి. భారతదేశంలో కూడా అలాంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా… రష్యాలోని ఒక గ్రామం కూడా వింతలకు నెలవు. ఈ గ్రామంలో మర్మాలు సైన్స్ కు అందనివి. రష్యాలోని ఉరల్ పర్వతాల సమీపంలో ఉన్న మోలియోబ్కా అనే ఈ గ్రామాన్ని ‘M-ట్రయాంగిల్’ లేదా ‘పెర్మ్ జోన్’ అని పిలుస్తారు. ఈ ప్రాంతం 70 చదరపు మైళ్లలో విస్తరించి ఉంది. రష్యన్ రాజధాని మాస్కో నుంచి దాదాపు 600 మైళ్ల దూరంలో ఉంది.

1980లలో ఈ గ్రామంలో నుంచి వింత శబ్దాలు వచ్చేవి. శాస్త్రవేత్తలు,పరిశోధనా సంస్థలు ఈ గ్రామాన్ని పరిశీలించి అధ్యయనం చేశాయి. ఈ గ్రమనికీ 40 కిలోమీటర్ల దూరంలో రోడ్లు ఉన్నాయి. ఈ గ్రామంలో వాహనాలు లేకపోయినా.. ఇక్కడ ట్రాఫిక్ శబ్దం వినిపిస్తుందని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఇలాంటి వింత శబ్దాలు ఎందుకు వస్తున్నాయో శాస్త్రానికి మించిన సంఘటనగా పరిశోధకులు అభివర్ణించారు. ఈ గ్రామంలో కొన్నిసార్లు మేఘాల మధ్య నుంచి భూమిపై ప్రకాశవంతమైన కాంతి కిరణం పడటం, దట్టమైన అడవులలో ఒక రకమైన శక్తి కదులుతున్నట్లు కనిపిస్తుందని చెబుతారు. ఈ వింత ఘటనని తమ కళ్ళతో చూసిన వారు కూడా ఉన్నారు.

ఈ మర్మమైన ప్రదేశం గురించి చాలా షాకింగ్ విషయం మరొకటి కూడా ఉంది. అవును ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తి ఈ మర్మమైన ప్రదేశానికి వెళ్ళాడు. అతను వెళ్ళినప్పుడు మానసిక వ్యక్తిగా వెళ్ళాడు. గ్రామం నుంచి అతను తిరిగి వచ్చినప్పుడు పరిపూర్ణ తెలివైన వ్యక్తి అయ్యాడు. అంతేకాదు మరొక వ్యక్తి ఈ గ్రామంలోకి తీవ్ర అనారోగ్యంతో వెళ్లి స్వయంగా కోలుకున్నాడు. అందువల్ల ఇక్కడ ఏదో అదృశ్య శక్తి ఉందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు ఉన్నాయి. ఫోన్లు మాత్రమే పనిచేయవు. అయితే నెట్‌వర్క్ ఒకే చోట అందుబాటులో ఉంటుంది. అవును, ఒక ప్రత్యేకమైన మట్టి దిబ్బ ప్రాంతం ఉంది. నెట్‌వర్క్ ఇక్కడ మాత్రమే పనిచేస్తుంది. ఎవరైనా ఫోన్ చేయాలంటే ఈ మట్టి దిబ్బ పైకి వెళ్ళాలి.. అక్కడ నిలిబడి ప్రపంచంలోని ఏ దేశానికైనా కాల్ చేయవచ్చు. అయితే ఆ దిబ్బ నుంచి కింద కు దిగిన వెంటనే, నెట్‌వర్క్ డిస్‌కనెక్ట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ M-ట్రయాంగిల్ ఒక రహస్యమా, అద్భుతమా, లేదా మరో ప్రపంచానికి ప్రవేశ ద్వారమా? ఈ ప్రశ్నకు ఇంకా ఎవరి దగ్గరా సమాధానం లేదు. అయితే ఈ గ్రామాన్ని సందర్శించిన వారి జీవితాలు మారినట్లు చాలామంది చెప్పారు. ఇది భయానకమైన గ్రామమే అయినప్పటికీ.. ఎవరికీ హాని కలిగించదు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..