ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి !

మనుషుల్లో కనిపించని విశ్వాసం, మానవత్వం, మంచితనాలు జంతువుల్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొవచ్చు. సాటి మనిషి సాయం చేసినా, వారికి చెడు చేయడమే నేటి సమాజంలో ఎక్కుగా చూస్తున్నాం. కానీ, మనిషి చేసిన సాయానికి వినయంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఓ తల్లి ఏనుగు. ప్రమాదం నుంచి తన బిడ్డను రక్షించిన అధికారులకు  ఆ తల్లి పలుమార్లు తొండం ఎత్తి ధన్యవాదాలు తెలుపుతూ… చూసిన వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కేరళలో చోటుచేసుకున్నట్లుగా తెలుస్తున్న ఆ వీడియోలో..ఓ గుంతలో పడిపోయిన […]

ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి !
మనుషుల్లో కనిపించని విశ్వాసం, మానవత్వం, మంచితనాలు జంతువుల్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొవచ్చు. సాటి మనిషి సాయం చేసినా, వారికి చెడు చేయడమే నేటి సమాజంలో ఎక్కుగా చూస్తున్నాం. కానీ, మనిషి చేసిన సాయానికి వినయంగా కృతజ్ఞతలు చెప్పుకుంది ఓ తల్లి ఏనుగు. ప్రమాదం నుంచి తన బిడ్డను రక్షించిన అధికారులకు  ఆ తల్లి పలుమార్లు తొండం ఎత్తి ధన్యవాదాలు తెలుపుతూ… చూసిన వారందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. కేరళలో చోటుచేసుకున్నట్లుగా తెలుస్తున్న ఆ వీడియోలో..ఓ గుంతలో పడిపోయిన ఏనుగు పిల్లను రక్షించడానికి పెద్ద ఏనుగులు చాలా ప్రయత్నించాయి. గున్నను బయటికి తీయడం వాటికి సాధ్యం కాలేదు. ఇంతలో అటవీ సిబ్బంది, స్థానికులు అక్కడికి వచ్చారు. పెద్ద ఏనుగులు చాటుకు తప్పుకున్నాయి. జనం జేసీబీ సాయంతో మట్టిని గుంతలో నింపడంతో పిల్ల ఏనుగు బయటికి వచ్చింది. పెద్ద ఏనుగులు దాన్ని అక్కున్న చేర్చుకున్నాయి. తల్లి ఏనుగు తన పిల్లను కాపాడినందుకు కృతజ్ఞతగా తొండాన్ని మనుషులవైపు పైకి చాచింది. మళ్లీ మళ్లీ పైకెత్తి ధన్యావాదాలు తెలిపింది. తర్వాత మిగతా ఏనుగులతో కలసి పిల్లను తీసుకుని అడవుల్లోకి వెళ్లింది. సోషల్‌ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్షల సంఖ్యలో దీనికి లైకులు, కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.