Viral Video: మాట్లాడుతుండగా జేబులోనే పేలిన మొబైల్‌..! వీడియో చూస్తే షాక్ అవుతారు..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 07, 2021 | 8:44 AM

Mobile Phone Blast: మొబైల్ మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ కొన్ని సార్లు దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

Viral Video: మాట్లాడుతుండగా జేబులోనే పేలిన మొబైల్‌..! వీడియో చూస్తే షాక్ అవుతారు..
Mobile Phone Blast

Mobile Phone Blast: మొబైల్ మనందరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ కొన్ని సార్లు దీని కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ప్రాణ నష్టం జరుగుతుండటంతో ప్రజలు ఒక్కోసారి వీటిని చూసి భయపడుతున్నారు. కొన్నిసార్లు మొబైల్స్‌ పేలిపోతున్నాయి. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు మొబైల్‌ వాడాలంటే భయపడుతారు. ఒకచోట కొంతమంది గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఒకరి జేబులో ఉన్న మొబైల్‌ హఠాత్తుగా పేలుతుంది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు మొబైల్‌ను జేబులో పెట్టుకోవడం చాలా ప్రమాదకరమని భావిస్తారు. ఎందుకంటే దీనివల్ల గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ఓ షాప్ లోపల కూర్చొని మాట్లాడుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇంతలో అకస్మాత్తుగా ఒక వ్యక్తి చొక్కా జేబులో ఉంచిన మొబైల్ ఫోన్ పేలుతుంది. జేబులోంచి పొగలు రావడం మనం వీడియోలో చూడవచ్చు.

అది చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడుతాడు. వెంటనే కాలిపోతున్న మొబైల్‌ తీసి కిందవేసి కాలితో బయటకు తోయడం మనం వీడియోలో చూడవచ్చు. మొబైల్ పేలుడు కారణంగా ప్రజలు ఎలా భయపడుతారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 60 లక్షల మందికి పైగా చూశారు. అయితే మూడు లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. అదే సమయంలో ఈ వీడియోను 20 వేల మందికి పైగా షేర్ చేశారు. చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మొబైల్‌ ఎప్పటికైనా డేంజరే అని వ్యాఖ్యానిస్తున్నారు.

నిపా వైరస్, కరోనా వైరస్‌ మధ్య తేడాలేంటి.. ఈ రెండింటిలో ఏది మరింత ప్రమాదం..

Vijay Devarakonda: మరోసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టిన విజయ్ దేవరకొండ.. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు సన్నాహాలు..

Cow Lovers: ఇక్కడి రైతులు తమ ఆవులను హెలికాప్టర్ ద్వారా తరలించారు.. కారణం తెలిస్తే..

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu