Vijay Devarakonda: మరోసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టిన విజయ్ దేవరకొండ.. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు సన్నాహాలు..

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పటి వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్...

Vijay Devarakonda: మరోసారి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏తో జతకట్టిన విజయ్ దేవరకొండ.. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చేందుకు సన్నాహాలు..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 07, 2021 | 7:58 AM

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పటి వరకు చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన విజయ్… సందీప్ వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీతో క్లిక్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన గీతా గోవిందం మూవీతో విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. దీంతో టాలీవుడ్‏లో విజయ్‏కు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. విజయ్ దేవరకొండతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్.. తన తదుపరి సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. శివ నిర్వాణ.. నిన్ను కోరి, మజిలి వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఇక ఇటీవల ఆయన రూపొందించిన టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది. ఇందులో నాని, రీతూ వర్మ జంటగా నటించారు. ఇక ఈ సినిమా తర్వాత శివ… విజయ్ దేవరకొండతో కలిసి సినిమా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. గతంలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాను కూడా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం మైత్రీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా ప్రాజెక్టులపై ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ సర్కారు వారి పాట, పుష్ప, అంటే సుందరానికి సినిమాలను నిర్మిస్తుంది.

Also Read: Bigg Boss 5 Telugu: మూడేళ్లుగా మోసం చేస్తూనే ఉన్నా.. మరోసారి సెన్సెషనల్ కామెంట్స్ చేసిన ప్రియాంక..

Bigg Boss 5 Telugu: సీరియస్.. ఎమోషనల్‍గా నామినేషన్ ప్రాసెస్.. ఎలిమినేషన్ జోన్‏లోకి ఆరుగురు సభ్యులు ..

BiggBoss5: కింగ్ నాగ్ బిగ్‌బాస్ జోష్.. సీరియల్ ప్రోమోల హోరుతో ప్రేక్షకుల బేజార్..