Viral: జూలో అరుదైన తెల్ల సింహాలు.. దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపైకి దూసుకొచ్చిన తల్లి.. చివరకు..

ఎంతటి క్రూరమృగాలైన తమ పిల్లల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటాయి. తమ పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే ఘనాలోని జూలో జరిగింది.

Viral: జూలో అరుదైన తెల్ల సింహాలు.. దొంగిలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపైకి దూసుకొచ్చిన తల్లి.. చివరకు..
Lion
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 30, 2022 | 2:01 PM

అమ్మ ప్రేమ వర్ణనాతీతం. తన జీవితం పూర్తిగా కుటుంబానికి.. పిల్లల కోసం అంకితం చేస్తుంది. తనకంటూ ఏమి ఆలోచించకుండా బిడ్డల ఎదుగుదల.. వారి లైఫ్ గురించి ప్రతి నిత్యం ఆలోచిస్తుంది. అదే తన బిడ్డలకు ఆపద వస్తే తన ప్రాణాలను అడ్డుగా పెడుతుంది. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటుంది. కేవలం మనుషులలో మాత్రమే కాదు.. జంతువులలోనూ అమ్మ ప్రేమ అనిర్వచనీయం. ఎంతటి క్రూరమృగాలైన తమ పిల్లల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటాయి. తమ పిల్లల జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తాయి. తాజాగా అలాంటి సంఘటనే ఘనాలోని జూలో జరిగింది. తన పిల్లను ఎత్తుకెళ్లెందుకు వచ్చిన ఓ వ్యక్తిని దారుణంగా చంపేసింది ఓ తల్లి సింహం. ఈ ఘటన అక్రా జూలో ఆదివారం చోటు చేసుకుంది.

బీబీసీ ప్రకారం అక్రాలోని జూలో గతేడాది నవంబర్ 2021లో రెండు అరుదైన తెల్ల సింహాలు జన్మించాయి. తాజాగా వాటిని దొంగిలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. జూలోని సింహాలు ఉన్న ఎన్‏క్లోజర్ లోపలి ఫెన్సింగ్‏లోకి ప్రవేశించాడు. తెల్ల సింహాల వద్దకు వెళ్తోన్న అతడిని గుర్తించిన తల్లి సింహం వెంటనే అతడిపై దూకి దాడి చేసి చంపేసినట్లుగా జూ అధికారులు తెలిపారు. సింహం దాడిలో మరణించిన అతడి మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు అధికారులు. అలాగే మరోవైపు అక్రా జూను తాత్కాలికంగా మూసివేశారు. పిల్లలు ఉన్నాయి కాబట్టి పర్యాటకులు ఎన్‏క్లోజర్ వద్దకు వస్తే తమ బిడ్డలను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారని సింహాలు భావిస్తాయని.. ఆగ్రహంతో దాడి చేసే అవకాశముందని ఘనాలోని సహజ వనరుల డిప్యూటీ మంత్రి బెనిటో ఓవుసు బయో తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆఫ్రికన్ సంస్కృతిలో తెల్ల సింహాలను పవిత్రంగా భావిస్తారు. వీటిని అక్రమంగా మార్కెట్‏లోకి తీసుకువచ్చి అమ్మెస్తుంటారు. గ్లోబల్ వైట్ లయన్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ప్రకారం అడవిలో కేవలం డజను తెల్ల సింహాలు మాత్రమే ఉన్నాయి.