Viral Video: వామ్మో.. కుప్పలు కుప్పలుగా కొండచిలువలు.. వీడియో చూస్తే గుండె గుభేలే.!

ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది. అలాంటి కోవకు..

Viral Video: వామ్మో.. కుప్పలు కుప్పలుగా కొండచిలువలు.. వీడియో చూస్తే గుండె గుభేలే.!
Pythons
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 13, 2022 | 5:42 PM

పాములను చూస్తే చాలు.. నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తాము. అదే ఓ భారీ సైజులో పైథాన్‌ ఎదురుపడితే.. ఇంకేమైనా ఉందా.? వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటిది ఒకటికాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పైథాన్లు ఒకేసారి కంటపడితే.. ఇక గుండె ఆగిపోయినంత పనవుతుంది. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నట్‌లో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి.!

ఓ గదిలో భారీ సైజులో ఉన్న నాలుగైదు కొండచిలువలను మీరు వీడియోలో చూడవచ్చు. ఇక వాటికి ఏమాత్రం భయం లేకుండా స్నానం చేయిస్తాడు ఓ వ్యక్తి. అతడు ఆ పైథాన్లకు బాత్ చేయించే తీరు చూస్తుంటే.. ఆ వ్యక్తి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Munding Aji (@munding_aji)

కాగా, ఈ వీడియోను ‘munding_aji’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. దీనికి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.