భారీ కింగ్ కోబ్రాను అవలీలగా పట్టుకున్నాడు.. కానీ, ఒక్కసారే గుండె ఆగినంత పనైంది.. వణుకుపుట్టించే వీడియో

ఓ వ్యక్తి చేతులతో భయంకరమైన కోబ్రాను ఎలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వ్యక్తిని చూడగానే నాగుపాముతో పడగవిప్పి బుసలు కొడుతూ ఎదురుతిరుగుతుంది.

భారీ కింగ్ కోబ్రాను అవలీలగా పట్టుకున్నాడు.. కానీ, ఒక్కసారే గుండె ఆగినంత పనైంది.. వణుకుపుట్టించే వీడియో
King Cobra Video
Follow us

|

Updated on: Oct 06, 2022 | 9:01 PM

సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వీడియోలు కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని భయంకరంగా ఉంటాయి. నెట్టింట ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. అయితే.. ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఓ భారీ కోబ్రాకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా దెబ్బకు షాక్ అవుతారు. సాధారణంగా పాములంటే చాలామందికి భయం ఉంటుంది. దూరం నుంచి చూస్తేనే వణుకుతూ పరుగులు తీస్తుంటారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం అలాంటి వారి కంటే కొంచెం భిన్నంగా ఉన్నాడు. బుసలు కొడుతూ ఎదురు తిరిగిన పామును అతను కంట్రోల్ చేసి మరి.. బంధించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది.. వామ్మో ఇలా కూడా ఉంటారా..? అంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఓ వ్యక్తి చేతులతో భయంకరమైన కోబ్రాను ఎలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వ్యక్తిని చూడగానే నాగుపాముతో పడగవిప్పి బుసలు కొడుతూ ఎదురుతిరుగుతుంది. చేతితో పట్టుకోగానే.. అది మొహం పైకి దూసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, అలా ఆగిపోతుంది. అనంతరం ఆ వ్యక్తి పామును బంధించే డ్రాయర్ లాంటి కంటైనర్‌లో ఉంచుతాడు. ఇంకెందుకు ఆలస్యం.. ముందుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి.

పాము వీడియో చూడండి..

అయితే పాము ఎదురుతిరిగినప్పుడు.. భయంకరంగా అనిపిస్తుంది. కానీ.. వ్యక్తి ముఖంలో పాము అంటే కనీసం భయం కూడా లేదు. పాము కూడా ఆ వ్యక్తికి సుపరిచితం కావడంతోనే.. అది ఎలాంటి హాని చేయలేదని అర్ధమవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది స్పందించకుండా ఉండలేకపోతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో world_of_snakes_ అనే యూజర్ దీనిని షేర్ చేయగా.. మిలియన్ల మంది వీక్షించి.. పలు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడైనా పాములతో జాగ్రత్తగా ఉండాలంటూ చూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..