Viral Video: వర్షంలో తడిసిన డైరీ.. తెరిచి చూడగానే కంటతడి పెట్టించిన ప్రతి పేజీ..!
రోడ్డు పక్కన వర్షానికి తడిసిపోయిన ఓ పాత డైరీ.. సాధారణంగా ఎవరైనా దానిని చెత్తగా భావించి వెళ్లిపోయేవారేమో. కానీ ఆదిత్య అనే యువకుడు, అతని స్నేహితులు మాత్రం ఆ డైరీని తీసి చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే వారిని భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆదిత్య ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో ఆదిత్య జాగ్రత్తగా తడిసిపోయిన డైరీని తెరిచి ఒక్కో పేజీని తిప్పుతుంటాడు. మొదట్లో సాధారణ నోట్స్ ఉంటాయని భావించిన వారు, అందులో కనిపించిన దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. ప్రతి పేజీ చేతితో రాసిన ప్రేమ సందేశాలు, హృద్యమైన సూక్తులు, ప్రేమ గీతాల పంక్తులు, రంగురంగుల చిత్రాలతో అందంగా అలంకరించి ఉంది. కొన్ని పేజీలకు చిన్న చాక్లెట్లు కూడా జ్ఞాపకంగా అతికించి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వర్షంలో పూర్తిగా తడిసి కొన్ని పేజీలు దెబ్బతిన్నప్పటికీ, ఆ డైరీ వెనుక ఉన్న ప్రేమ, శ్రమ, భావోద్వేగం మాత్రం స్పష్టంగా కనిపించాయి. ఇది ఓ యువతి ఎంతో సమయం వెచ్చించి, తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను స్క్రాప్‌బుక్ రూపంలో భద్రపరిచిన డైరీలా కనిపిస్తోందని ఆదిత్య వ్యాఖ్యానించాడు. ఈ అమూల్యమైన జ్ఞాపకం మళ్లీ దాని అసలు యజమానికి చేరాలని కోరుతూ వీడియోను ఎక్కువ మంది షేర్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. “సోదరా… ఇదే నిజమైన ప్రేమ. ఈ వీడియోను షేర్ చేయండి. ఇంత కష్టపడి దీన్ని తయారు చేసిన వ్యక్తికి ఇది తిరిగి చేరాలి” అంటూ ఆదిత్య క్యాప్షన్ ఇవ్వడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు ఇది ప్రమాదవశాత్తు పోయి ఉంటుందని అభిప్రాయపడగా, మరికొందరు విఫలమైన ప్రేమకథకు గుర్తుగా ఎవరో పారేసి ఉంటారేమోనని భావించారు.
అయితే ఒక విషయంలో మాత్రం అందరూ ఏకీభవించారు. డైరీలోని ప్రతి పేజీ వెనుక ఉన్న ప్రేమ, అంకితభావం, సృజనాత్మకతను డబ్బుతో కొనలేమని, అలాంటి జ్ఞాపకాలకు విలువ అమూల్యమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది మందిని భావోద్వేగానికి గురిచేస్తూ, ఆ డైరీ అసలు యజమాని ఎవరనే ఆసక్తిని మరింత పెంచుతోంది.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..