AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బాబోయ్‌.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..’

రెండు చేతుల లక్షలు సంపాదించే ఓ చార్టర్డ్ అకౌంటెంట్.. మీనల్ గోయల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.20 లక్షల పెళ్లి బడ్జెట్‌లో కేటరింగ్, వెన్యూ, డెకరేషన్, ఫోటోగ్రఫీ, వినోద కార్యక్రమాలు వంటి ఖర్చులు ఎలా కేవలం 24 గంటల్లో పూర్తవుతాయో ఆమె వివరించారు. ఆర్థిక స్థోమతకు అనుగుణంగా వివాహ వేడుకలు జరుపుకోవాలని, పెళ్లి జీవితాన్ని అప్పులతో కాకుండా ఆర్థిక ప్రశాంతతతో ప్రారంభించాలని ఆమె చెబుతున్న మాటలు నెటిజన్లకు సుతారం నచ్చడం లేదు. ఎందుకో మీరే తెలుసుకోండి..

'బాబోయ్‌.. కేవలం 24 గంటల్లో రూ.20 లక్షలా! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అంత అవసరమా? బ్రో..'
Indian Weddings Become A Financial Burden
Srilakshmi C
|

Updated on: Jul 24, 2026 | 11:35 AM

Share

మన లోగిళ్లలో పెళ్లి వేడుక కేవలం రెండు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల వేడుకగా, పండుగలా నిర్వహిస్తారు. కొందరు జీవితంలో ఒక్కసారే వచ్చే ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరికొందరు తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా సాదాసీదాగా పెళ్లి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పెళ్లి ఖర్చులపై కొత్త చర్చకు దారితీసింది. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులో, రూ.20 లక్షల పెళ్లి బడ్జెట్ కేవలం రెండు రోజుల్లో ఎలా పూర్తిగా ఖర్చవుతుందో వివరించారు. ఆమె తెలిపిన లెక్కల ప్రకారం, పెళ్లి వేడుకలోని ప్రతి అంశం భారీ వ్యయానికి కారణమవుతోంది.

మా పెళ్లికి ఎంత ఖర్చు అయిందంటే..?

  • ఆహారం (కేటరింగ్): రూ.6 లక్షలు
  • వేదిక (వెన్యూ): రూ.5 లక్షలు
  • అలంకరణ (డెకరేషన్): రూ.3 లక్షలు
  • ఫోటోగ్రఫీ: రూ.2 లక్షలు
  • డీజే/వినోద కార్యక్రమాలు: రూ.2 లక్షలు
  • ఇతర ఖర్చులు: రూ.2 లక్షలు

ఇలా మొత్తంగా రూ.20 లక్షలు కేవలం 24 గంటల్లోనే ఖర్చవుతున్నాయని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టులో ఆమె ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. పెళ్లి విందు కొన్ని గంటలే కొనసాగుతుంది. డీజే కార్యక్రమం నాలుగు గంటలకే పరిమితం అవుతుంది. అలంకరణ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఫోటోలు కొన్ని ఆల్బమ్‌లుగా మాత్రమే మిగులుతాయి. పెళ్లి వేదికను మరుసటి ఉదయానికే నిర్వాహకులకు తిరిగి అప్పగించాల్సి వస్తుంది. అయితే వీటన్నింటికీ కలిపి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని ఆమె వివరించారు. ‘అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి. వేడుక జరుపుకోండి.. కానీ అప్పుల్లో పడొద్దు..’ అని చెప్పన మీనల్ గోయల్ తాను పెళ్లి వేడుకలను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేశారు. అయితే తమ ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేయకుండా వివాహాన్ని జరుపుకోవాలని ఆమె సూచించారు. ‘పెళ్లి ఒక వేడుక. అది ఆర్థిక భారంగా మారకూడదు. మీ స్థోమతకు తగ్గట్టుగా వేడుకను జరుపుకోండి. అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి. ఆర్థిక ఒత్తిడితో కాకుండా, ఆర్థిక ప్రశాంతతతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించండి. ఒకరోజు పెళ్లికంటే జీవితాంతం నిలిచే వైవాహిక బంధాన్ని నిర్మించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండని’ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.

ఇక మీనల్ గోయల్ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లిళ్లలో అవసరానికి మించి ఖర్చు చేయాలా? లేక ఆ డబ్బును భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేసుకోవాలా? అనే అంశంపై నెటిజన్లు చర్చోపచర్చలు చేస్తున్నారు. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు జీవితంలో ఒక్కసారే వచ్చే వేడుక కావడంతో ఖర్చు చేయడంలో తప్పేమీ లేదని కుండబద్దలు కొడుతున్నారు. ఇంతకీ మీ పెళ్లి వేడుకకు ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో చెప్పనేలేదు. కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయం చెప్పండి..

Follow Us
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
'పెళ్లా.. అంతొద్దు! అన్నీ క్షణాల్లో ముగిసిపోతాయి.. అవసరమా?'
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
పేపర్ లీకేజీల మూలాలను నరికేసేలా చారిత్రాత్మక బిల్లు!
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
కృష్ణం రాజు చేయాల్సిన సినిమా.. చిరంజీవి కెరీర్ మార్చేసింది..
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
నేరుగా మీ మొబైల్‌కే ప్రతీ నెలా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
'బలిపశువైన ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణారెడ్డి.. ఇది కరెక్ట్ కాదు'
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
పిడికెడు ఉడకబెట్టి తింటే చాలు.. ఉక్కు లాంటి బలమైన కండలు మీ సొంతం
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే డౌన్
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
శుక్రవారం స్పెషల్.. ఈ వస్తువులను దానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..
ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. కానీ చిన్న వయసులోనే..