AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!

New Ration Rules: ఇప్పటివరకు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం- 2013లో మార్పులు చేయాలని కేంద్ర..

New Ration Rules: ఆ రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ అప్‌డేట్.. ప్రతి వ్యక్తికి 7 కిలోల బియ్యం!
Ration Card
Subhash Goud
|

Updated on: Jul 24, 2026 | 5:14 PM

Share

New Ration Rules: రేషన్‌ సరుకుల విధానంలో కేంద్రం కీలక మార్పులు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు. మరోవైపు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు.

అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని సందర్భాల్లో నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ 35 కిలోలకే పరిమితం కావడంతో ఒక్కో వ్యక్తికి అందే ధాన్యం పరిమాణం తగ్గిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యంత పేద వర్గాలకు చెందిన పెద్ద కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించారు.

ఇప్పటివరకు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా నెలకు 35 కిలోలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం- 2013లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన (AAY) కింద ధాన్యం కేటాయింపును, ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల నుండి ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోలకు (గరిష్ట పరిమితి 35 కిలోలతో) తగ్గించాలని యోచిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రేషన్ కోటాలో కాస్త కొత విధించినట్లేనని చెప్పవచ్చు. ఆహార, ప్రజా పంపిణీ శాఖ, జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013కు సవరణలను ప్రతిపాదించగా, ఆహార మంత్రిత్వ శాఖ జాతీయ ఆహార భద్రతా (సవరణ) బిల్లు, 2026పై జూలైలోగా ప్రజల నుండి అభిప్రాయాలను కోరింది.

ప్రతిపాదిత కొత్త నిబంధన ప్రకారం.. ఇకపై కుటుంబ ఆధారిత కేటాయింపునకు బదులుగా ఒక్కో వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున ధాన్యాన్ని అందించేలా సవరణ ప్రతిపాదించారు. అయితే, ఏ కుటుంబానికి అయినా గరిష్ట పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.

సాధారణ ప్రాధాన్యత ఉన్న పేద కుటుంబాలకు ప్రస్తుతం మనిషికి 5 కిలోల చొప్పున రేషన్ ఇస్తున్నారు. కానీ, పెద్ద AAY కుటుంబాల్లో (సభ్యులు ఎక్కువ ఉన్న చోట) కుటుంబానికి 35 కిలోలే రావడంతో ఒక్కో వ్యక్తికి అందే ఆహార ధాన్యం పరిమాణం మిగతా పేదల కంటే తక్కువగా ఉంటోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసి, పెద్ద కుటుంబాలకు న్యాయం చేయడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశం.

కొత్త నిబంధన అమలు విధానం (ఉదాహరణలు):2 సభ్యులు ఉన్న కుటుంబం నెలకు 14 కిలోలు లభిస్తాయి (2×7 కిలోలు) 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబానికి గరిష్ట పరిమితి ప్రకారం 35 కిలోలు లభిస్తాయి. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ‘జాతీయ ఆహార భద్రత (సవరణ) బిల్లు, 2026’ పై ప్రజల అభిప్రాయాలను కోరింది. లబ్ధిదారులకు ఉచిత బియ్యం, గోధుమల సరఫరా మునుపటిలాగే కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి: Indian Railways: కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం!

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
భారీ వర్షాల్లోనూ తగ్గని లడ్డూ క్రేజీ..! జూమ్‌లో వేలం!
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
అప్పటి నుంచి ఆ హీరోయిన్ సినిమాలు చూడటం మానేశా..
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
టేకు ఆకులలో దాగి ఉన్న అద్భుత ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
ఐటీ కారిడార్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం..!
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
వైభవ్ సూర్యవంశీకి సవాల్ విసిరిన న్యూజిలాండ్ కోచ్
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేవారికి బిగ్‌ అలర్ట్‌.. కొత్త రూల్స్‌..!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఈ రాశులకు విపరీత రాజయోగం, లక్ష్మీ కటాక్షంతో పట్టిందల్లా బంగారమే!
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
ఖైరతాబాద్‌ బాహుబలి గణపతికి..రథసారథి ఎవరో తెలుసా? అతడి జీతం ఎంతంటే
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం