AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాదాపూర్‌‌లోని ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. పోలీసుల తనిఖీల బట్టబయలు..!

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ కారిడార్‌లో అక్రమంగా నడుస్తున్న రమ్మీ బెట్టింగ్ రాకెట్‌ను కూకట్‌పల్లి ఎస్‌వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. విశ్వసనీయ సమాచారంతో కాకతీయ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, రూ.1.47 లక్షల నగదు, 25 ప్లేయింగ్ కార్డు సెట్లతో పాటు ఆరుగురిని అరెస్టు చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

మాదాపూర్‌‌లోని ఫ్లాట్‌లో గుట్టుచప్పుడు కాకుండా యవ్వారం.. పోలీసుల తనిఖీల బట్టబయలు..!
Madhapur Rummy Betting Racket
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Sep 25, 2026 | 10:06 AM

Share

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఐటీ కారిడార్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న రమ్మీ బెట్టింగ్ రాకెట్‌ను కూకట్‌పల్లి జోన్ ప్రత్యేక ఆపరేషన్ టీమ్ ఎస్‌వోటీ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి విజయవంతంగా బట్టబయలు చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ ముందస్తు సమాచారం ఆధారంగా కాకతీయ హిల్స్, రోడ్ నంబర్ 7 లో ఉన్న కైజెన్ వెంకటేశ్వర నిలయం అపార్ట్‌మెంట్‌పై ఒక్కసారిగా దాడి జరిపారు. సదరు అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 301 ను కేంద్రంగా చేసుకుని గత కొంతకాలంగా రహస్యంగా జూద క్రీడలు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

సోదాల సమయంలో ఫ్లాట్‌లో భారీగా నగదు పందేలు కాస్తూ రమ్మీ ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఈ అక్రమ రమ్మీ స్థావరాన్ని నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడితో పాటు, బెట్టింగ్‌కు పాల్పడుతున్న మరో ఐదుగురు పాల్గొన్నట్లు గుర్తించారు. దాడి అనంతరం సంఘటనా స్థలం నుండి పోలీసులు రూ.1,47,940 నికర నగదుతో పాటు ఆట కోసం ఉపయోగిస్తున్న 25 సెట్ల ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన ఆరుగురు నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు మరియ సామాగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్థానిక మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలోని నివాస ప్రాంతాలు, అపార్ట్‌మెంట్లలో రహస్యంగా జూద కేంద్రాలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఓటీ పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
'NEET దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు'.. HC
'NEET దరఖాస్తులో తప్పు చేశారా? కోర్టులో సానుభూతి కోరొద్దు'.. HC
లోకల్ వార్‌లో వారసుల సంగతేంటీ..? ఎవరు హిట్.. ఎవరికీ షాక్..!
లోకల్ వార్‌లో వారసుల సంగతేంటీ..? ఎవరు హిట్.. ఎవరికీ షాక్..!
పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది..!
పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది..!
‏ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. ఇప్పుడు బతుకుదేరువు కోసం వాచ్‏మెన్‏గా
‏ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. ఇప్పుడు బతుకుదేరువు కోసం వాచ్‏మెన్‏గా
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్