AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce: విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త.. కారు వెనకాల ఆ విషయం రాసుకొని మరీ

పెళ్లైన తర్వాత కలిసి బతకలేమని భావించిన కొందరు భార్యభర్తలు విడాకులు తీసుకోవడం సాధరణమే. అయితే విడాకులు తీసుకున్నాక ఈ విషయం గురించి ఇతరులకు చెప్పేందుకు చాలా మంది జంకుతారు. విడాకులు తీసుకున్నామనే బాధలో కూడా ఉంటారు.

Divorce: విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త.. కారు వెనకాల ఆ విషయం రాసుకొని మరీ
Angus Kennedy
Aravind B
|

Updated on: Apr 18, 2023 | 9:16 AM

Share

పెళ్లైన తర్వాత కలిసి బతకలేమని భావించిన కొందరు భార్యభర్తలు విడాకులు తీసుకోవడం సాధరణమే. అయితే విడాకులు తీసుకున్నాక ఈ విషయం గురించి ఇతరులకు చెప్పేందుకు చాలా మంది జంకుతారు. విడాకులు తీసుకున్నామనే బాధలో కూడా ఉంటారు. కానీ లండన్ లోని అంగస్ కెన్నెడీ అనే వ్యక్తి తన భార్య సోఫీతో విడాకులు తీసుకున్న తర్వాత కార్లో తిరుగుతూ సెలబ్రెట్ చేసుకున్నాడు. అంతేకాదు కారు వెనకాల జస్ట్ డివోర్స్‌డ్ అని రాసుకుని డార్ట్‌ఫార్డ్ ప్రాంతంలో రౌండ్లు వేశాడు. అయితే ఇలా ఎందుకు చేశాడంటే తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాక ఇక తాను సింగిల్ అని ఇతరులకు తెలియజేసేందుకు ముఖ్యంగా అమ్మాయిలను ఆకర్షించేదుకు ఇలా రోడ్లపై చక్కర్లు కొట్టాడు.

విడాకులు తీసుకున్నంత మాత్రాన విచారంగా, బాధగా ఉండల్సిన అవసరం లేదని.. మళ్లీ ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి చేసుకోవాల్సిన వేడుక లాంటిదేనని అంగస్ తెలిపాడు. అలగే తన మాజీ భార్య సోఫీతో కేవలం ఒక బంధం మాత్రమే విడిపోయిందని.. తాము ఇప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటున్నామని పేర్కొన్నాడు. 2004లో అంగస్, సోఫీ లు వివాహం చేసుకున్నారు.  2021 జులైలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో వాళ్ల విడాకులు ఖరారయ్యాయి. అలాగే వాళ్లిద్దరికి ఉన్న ఐదుగురు పిల్లలను కూడా కలిసి పంచుకుంటున్నారు. అయితే అంగస్ అలా కారులో తిరగడంపై అతని మాజీ భార్య సోఫీ కూడా స్పందించింది. అతను అలా చేయడం సరదాగా ఉందని..విడాకులు తీసుకున్న తర్వాత కూడా స్నేహితులుగా ఉండటం సాధ్యమేనని తన పిల్లలకు చూపించేందుకు స్నేహపూర్వకరమైన విడాకులు తీసుకోవాలనుకున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..