AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేతిపై 18 గుడ్లను బ్యాలెన్స్ చేసిన యువకుడు.. శెభాష్ అంటున్న నెటిజన్లు

ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిదాన్ని చేయాలని కొందరు పరితపిస్తుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి నిరంతరం సాధన చేస్తుంటారు. లక్ష్యాన్ని చేరుకుని, తమ ప్రతిభతో ఎన్నో అవార్డులను కొల్లగొడుతుంటారు....

Viral Video: చేతిపై 18 గుడ్లను బ్యాలెన్స్ చేసిన యువకుడు.. శెభాష్ అంటున్న నెటిజన్లు
Egg Balance
Ganesh Mudavath
|

Updated on: Mar 06, 2022 | 3:44 PM

Share

ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిదాన్ని చేయాలని కొందరు పరితపిస్తుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి నిరంతరం సాధన చేస్తుంటారు. లక్ష్యాన్ని చేరుకుని, తమ ప్రతిభతో ఎన్నో అవార్డులను కొల్లగొడుతుంటారు. ఓ ఐదు, ఆరు గుడ్లు (Eggs) చేతిలో పట్టుకోవాలంటేనే ఎక్కడ పగిలిపోతాయోనని భయపడిపోతాం. డజను గుడ్లు షాప్‌ నుంచి జాగ్రత్తగా పగలకుండా ఇంటికి తీసుకురావడానికి నానా అవస్థలు పడతాం. అటువంటిది ఓ వ్యక్తి తన చేతిపై ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 18 గుడ్లను బ్యాలెన్స్ చేశాడు. ఆ వ్యక్తి గుడ్లను బ్యాలన్స్ చేస్తుంటే కళ్లార్పకుండా చూస్తాం. ఎక్కడ పడిపోతాయాని తెగ కంగారు పడిపోతాం. కానీ అతను మాత్రం చక్కగా చేతి వెనుకభాగంపై 18 గుడ్లు నిలబెట్టి (balance) వావ్ అనిపించాడు. ఇరాక్‌కు చెందిన ఇబ్రహీం అనే యువకుడు మాత్రం.. అరచేతి వెనుక భాగంతో ఏకంగా 18 గుడ్లను బ్యాలెన్స్ చేసి ఔరా! అనిపించాడు. అంతేకాకుండా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. అందుకు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Guinness World Records Arabia (@gwrarabia)

Also Read

Zodiac Signs: ఈ 4 రాశులవారు గెలిచేవరకు పోరాడుతారు.. చివరకు సాధిస్తారు..!

Four Legged Chicken: జనగాం జిల్లాలో వింత కోడిపిల్ల జననం.. బారులు తీరిన జనం..

Toothpast Colors: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల అర్థాలు ఏమిటో తెలుసా..?