Four Legged Chicken: జనగాం జిల్లాలో వింత కోడిపిల్ల జననం.. బారులు తీరిన జనం..
Four Legged Chicken: ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల ఇలా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ముఖ్యంగా గత..
Four Legged Chicken: ప్రపంచంలో ప్రకృతికి విరుద్ధంగా ఆవు పంది పిల్లకు పాలు ఇవ్వడం, కుక్క పిల్లి స్నేహం, మేకకు మనిషి రూపంలో పిల్ల ఇలా అనేక వింత సంఘటనలు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. ముఖ్యంగా గత కొద్ది కాలంగా సోషల్ మీడియా(Social మీడియా) వేదికగా అనేకానేనక వింత సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కోడిపిల్లలు వింతవింతగా జన్మించాయనే వార్తలు తరచుగా వింటున్నాం.. తాజాగా జనగాం జిల్లా(jangaon district) దేవరుప్పుల మండలంలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.
మండలంలోని కొత్తవాడ కాలనీలో శివరాత్రి వెంకటయ్య అనే వ్యక్తి ఇంట్లో ఓ కోడి వింత కోడిపిల్లకు జన్మనిచ్చింది. సాధారణంగా కోడికి రెండు కాళ్లు ఉండడం చూసాం. కానీ ఓ కోడిపిల్లకు నాలుగు కాళ్లతో జన్మించింది. ఈ విషయం తెలిసి గ్రామస్థులు వింత కోడిపిల్ల అంటూ చూడడానికి బారులు తీరారు. భారీగా గ్రామస్థులు నాలుగు కాళ్ళ కోడిపిల్లను ఆసక్తిగా చూస్తున్నారు. ఆ తల్లి కోడి మొత్తం 12పిల్లల్ని పొదిగింది. అందులో ఓ కోడిపిల్ల ఇలా వింతగా జన్మించింది..పైగా ఈ కోడిపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్టు ఇంటి యజమాని తెలిపారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కలియుగంలో ఇలాంటి అనేక వింతలూ విశేషాలు జరుగుతాయని చెప్పిన విషయం కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు.
Also Read: