Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ.

Trending News: కొత్త జంట కాపురంలో మ్యాగీ చిచ్చు..విడాకులకు దారితీసిన వ్యవహారం
Maggi Case
Follow us

|

Updated on: May 30, 2022 | 5:00 PM

ఇన్‌స్టాంట్‌గా ఆకలి తీర్చే మ్యాగీ నూడిల్స్ అంటే పిల్లు, పెద్దలు పడిచస్తారు. అయితే ఇప్పుడు ఇదే మ్యాగీ ఓ కొత్తజంట కాపురంలో చిచ్చుపెట్టింది. ఏకంగా ఆ నూతన వధూవరులు విడాకులు తీసుకునే వరకు వెళ్లేలా చేసింది మ్యాగీ. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మైసూరులోని ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం ఎల్‌ రఘునాథ్‌ బళ్లారిలో జిల్లా జడ్జిగా ఉన్నప్పటి వృత్తాంతాన్ని తాజాగా బయటపెట్టారు. దాంతో విషయం వైరల్‌గా మారింది.

చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకులు కోరే కేసులపై లాయర్‌ రఘునాథ్ మాట్లాడుతూ..ఓ మ్యాగీ కేసును గురించి వివరించారు. అతను బళ్లారిలో జిల్లా న్యాయమూర్తిగా ఉన్నప్పటి నుండి ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును గుర్తుచేసుకున్నాడు. ఓ వ్యక్తి ఒక విచిత్ర కేసును తన వద్దకు తీసుకొచ్చినట్టుగా చెప్పాడు. ఆ కేసును జడ్జీ మ్యాగీ కేసుగా పిలుచుకునేవారని గుర్తు చేసుకున్నారు. అతడు తన భార్యకు వంటరాదని, కేవలం తన భార్య తక్షణ నూడుల్స్ మాత్రమే వండగలదని తెలుసుకున్న ఓ భర్త కోర్టును ఆశ్రయించి విడాకులు కోరాడు. మైసూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎంఎల్ రఘునాథ్ దీనిని “మ్యాగీ కేసు” అని పిలిచారు. బాధితుడి భార్య అతనికి అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం కోసం మూడు పూటల మ్యాగీనే వడ్డించేదని కంప్లైట్‌ చేశాడు. అలాంటి మహిళతో తనకు విడాకులు ఇప్పించాలని కోరినట్టుగా జడ్జీ రఘునాథ్‌ వివరించారు. ఆ జంట పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏళ్లుగా విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. విడాకులు తీసుకోవడానికి ముందు జంటలు కనీసం ఒక సంవత్సరం పాటు కలిసి ఉండవలసి ఉంటుంది,” అని జడ్జీ ఎంఎల్‌ రాఘునాథ్‌ పేర్కొన్నారు. రాజీ, తిరిగి కలుసుకోవడం ద్వారా జంటలు తమ విభేదాలను పరిష్కరించుకోవడానికి కోర్టులు సెంటిమెంట్‌ను ఎలా ఉపయోగిస్తాయో దాని గురించి సవవిరంగా వివరించారు. చాలా వరకు, సమస్యలు శారీరకం కంటే మానసికంగా ఉంటాయన్నారు. చిన్న చిన్న విషయాలకే దంపతులు విడాకుల కోసం దాఖలు చేసే మ్యాట్రిమోనియల్ కేసులపై విలేకరుల సమావేశంలో ఇదంతా వెల్లడించారు జడ్జీ రఘునాథ్‌.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.