AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిరుతతో అలా ఉంటది మరి.. చెట్టుపైకి ఎక్కి కోతిని ఎలా పట్టుకుందో చూడండి.. వీడియో

పులి కోతిని వేటాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరుతపులి కోతిని వేటాడిన క్షణాన్ని చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

Viral Video: చిరుతతో అలా ఉంటది మరి.. చెట్టుపైకి ఎక్కి కోతిని ఎలా పట్టుకుందో చూడండి.. వీడియో
Viral
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2022 | 5:55 PM

Share

Leopard hunting monkey viral video: జంతు ప్రపంచం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అడవిలో బతకాలంటే నిత్యం పోరాటం చేయాల్సిందే.. చిన్న జంతువులను పెద్ద జంతువులు, పెద్ద వాటిని క్రూర మృగాలు వేటాడి ఆహారంగా చేసుకుంటుంటాయి.. వీటికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా, ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా.. పులి కోతిని వేటాడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చిరుతపులి కోతిని వేటాడిన క్షణాన్ని చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పన్నా టైగర్ రిజర్వ్ పులులు, చిరుతపులులతోపాటు మరెన్నో వన్యప్రాణులకు నిలయంగా ఉంది.

ఆకలితో ఉన్న చిరుతపులి చెట్టుపైకి ఎక్కి కోతిని చంపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కోతిని చంపిన తరువాత.. చెట్టు దిగుతున్నప్పుడు చిరుత ఎరను నోటిలో గట్టిగా పట్టుకుని కనిపించింది. పన్నా టైగర్ రిజర్వ్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ఈ వీడియోను షేర్ చేసింది. “పన్నా టైగర్ రిజర్వ్‌లో చిరుతపులి కోతిని వేటాడే అరుదైన దృశ్యం” అంటూ దానిలో రాసింది. ఈ వీడియోను టైగర్ రిజర్వ్ అధికారులు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:

వైరల్ వీడియోను చూసి నెటిజన్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. చూస్తుంటే ఒళ్లు జలధరిస్తుందని కొంతమంది పేర్కొంటుండగా.. పాపం కోతి అలా ఎలా దొరికిందంటూ మరికొందరు పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..