Bull Fight: రెండు ఎద్దులు కొట్టుకుంటుంటే.. బాహుబలిలో భల్లాల దేవలా ఆపాలనుకున్నాడు.. కట్ చేస్తే..
ఎక్కడైనా సరే రెండు ఎద్దుల మధ్య గొడవ జరుగుతుంటే వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలి లేదా వాటికి దూరంగా పారిపోవాలి. అనంతరం ఆ ఎద్దుల మధ్య పోరాటాన్ని ఆపడానికి ఏర్పాట్లు చేయాలి. అంతేకాని ఎద్దులను అదుపుచేయడం కోసం మీరు బాహుబలి సినిమాలోని భల్లాల్‌దేవ్‌గా వెళ్లి ప్రయత్నిస్తే.. అందుకు తగిన ఫలితం తప్పనిసరిగా ఊహించని విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి.

ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఆ గొడవలను చూసి ఆనందించడమో, వీడియో తీయడమే కాదు ఆ పోరాటాన్ని ముగించేలా చెయ్యడం తమ బాధ్యత అని కూడా కొందరు భావిస్తారు. అయితే ఎవరినా గొడవ పడుతుంటే వారిని విడదీసే ముందు అసలు ఆ పోరాటం ఎందుకు.. ఎవరు గొడవ పడుతున్నారు అనే విషయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు తమకు కాని విషయంలో జోక్యం చేసుకున్న వారికి కూడా కఠినమైన శిక్ష పడుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ తింటున్నారు.
ఎక్కడైనా సరే రెండు ఎద్దుల మధ్య గొడవ జరుగుతుంటే వెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయాలి లేదా వాటికి దూరంగా పారిపోవాలి. అనంతరం ఆ ఎద్దుల మధ్య పోరాటాన్ని ఆపడానికి ఏర్పాట్లు చేయాలి. అంతేకాని ఎద్దులను అదుపుచేయడం కోసం మీరు బాహుబలి సినిమాలోని భల్లాల్‌దేవ్‌గా వెళ్లి ప్రయత్నిస్తే.. అందుకు తగిన ఫలితం తప్పనిసరిగా ఊహించని విధంగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి. అక్కడ ఒక వ్యక్తి రెండు ఎద్దులు గొడవ పడుతున్న సమయంలో జోక్యం చేసుక్కున్నాడు. ఒక ఎద్దు తోక పట్టుకుని ఆపాలనుకున్నాడు అది కుదరక.. మరొక ఎద్దు దగ్గరకు వచ్చి చెయ్యి వెయ్యబోయాడు.. అంతే ఆ ఎద్దు తన తోటి ఎద్దుమీద యుద్ధానికి వెళ్ళాలనే సంగతి మరచి.. తమ మధ్యకు వచ్చిన యువకుడిని కొమ్ములతో కుమ్మడానికి ప్రయత్నిచింది. అంతే ఆ యువకుడు భయంతో అక్కడ నుంచి పరుగులంకించుకున్నాడు.
ఇక్కడ వీడియో చూడండి
भल्लालदेव बनने आए युवक की आई शामत | pic.twitter.com/y2rGwywnXz
— Dharmesh Pandey (@Dharmeshspandey) February 29, 2024
ఓ వీధిలో రెండు ఎద్దులు ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం వీడియోలో చూడవచ్చు. ఓ వైపు వ్యక్తులు నిలబడి వీడియో తీస్తుండగా, మరోవైపు ఓ వ్యక్తి ఆ రెండు ఎద్దులు కొట్టుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చాలా సార్లు ఎద్దు అతడిని పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆ యువకుడు అక్కడ నుంచి బయటకు రాకుండా మరొక ఎద్దు దగ్గరకు వెళ్ళాడు. దీంతో ఎద్దు అతడిని గాలిలోకి విసిరి కింద పడేసింది. తర్వాత ఆ రెండు ఎద్దులు మరొక ప్రదేశానికి వెళ్లి గొడవకు దిగాయి. వైరల్ అవుతున్న ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా రాజ్‌పురా ప్రాంతానికి చెందినది.
ఈ క్లిప్ Xలో భాగస్వామ్యం చేయబడింది.ఈ క్లిప్‌ను చూసిన తర్వాత ప్రజలు రకరకాల వ్యాఖ్యలతో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఓ యూజర్ అంత దురుసుగా ఉండకూడదని హాస్యాస్పదంగా కామెంట్ చేస్తే.. మరొకరు శాంతి దూతగా మారేందుకు వెళ్లి గాలిలో ఎగిరిపోయాడని ఫన్నీగా కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




