Viral Video: వాటే స్మార్ట్ ఐడియా.. లవ్‏బర్డ్ తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..

మనుషులకే కాదు.. జంతువులకు... పక్షులకు కూడా తెలివి ఉంటుంది. కొన్నిసార్లు.. అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవరిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.

Viral Video: వాటే స్మార్ట్ ఐడియా.. లవ్‏బర్డ్ తెలివికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్..
Love Bird
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 24, 2021 | 10:00 AM

మనుషులకే కాదు.. జంతువులకు… పక్షులకు కూడా తెలివి ఉంటుంది. కొన్నిసార్లు.. అవి కూడా మనుషుల మాదిరిగానే ప్రవరిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే మనం చూసినంతవరకు.. కుక్కలు, కోతులు, ఏనుగులు తమ పిల్లల కోసం చేసే పనులు ముచ్చటగా అనిపిస్తాయి. అలాగే పక్షులకు కూడా చాలా తెలివే ఉంటుంది. ఉదాహరణకు పక్షుల ఇంటి నిర్మాణాన్ని చూస్తే అర్ధమవుతుంది అవి ఎంత తెలివైనవో. ఆ ఇంటి నిర్మాణం కోసం చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలను సేకరించి.. వాటిని అల్ల చిత్రవిచిత్రంగా గూళ్లు కట్టుకుంటాయి. అలాగే ఇప్పుడు ఓ లవ్ బర్డ్ కూడా తన ఇంటి నిర్మాణం కోసం కొన్ని తీగలు, కొమ్మలను సేకరిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో.. లవ్ బర్డ్ ఎంతో తెలివిగా.. నెమ్మదిగా.. ఆకులోని మధ్య ఈనెను తొలచివేస్తుంది. అలా తొలగించిన వాటిని తన ఈకల్లో దాచిపెడుతుంది. మాములుగా అయితే నోటితో పట్టుకుని… గూడు నిర్మించే చోటుకి వెళ్లిపోయేది. కానీ ఒక్కోసారి ఒక్కోటి పట్టుకుని వెళితే.. సమయం, శ్రమ ఎక్కువ అవుతుందని ఆలోచించిన లవ్ బర్డ్ ఈనెలను తన ఈకల్లో దాచుకుంటుంది. ఆ లవ్ బర్డ్ తెలివిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు… దీనిని ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు పక్షి తెలివికి ఫిదా అవుతున్నారు.

ట్వీట్..

Also Read: వినియోగదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్.. మారనున్న పలు అంశాలు.. గ్యాస్.. బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం..

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి