Viral Video: స్నేహమంటే ఇదేరా..!! కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..
స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ స్నేహం చేయని మనిషి ఉండరు. స్నేహం గురించి ఎంతో మంచి ఎన్నో కథలు,కావ్యాలు రాసి దాని గొప్పతనాన్ని తెలిపారు.
Viral Video: స్నేహం.. ప్రపంచంలో ప్రేమించని మనిషి ఉంటాడేమో కానీ స్నేహం చేయని మనిషి ఉండరు. స్నేహం గురించి ఎంతో మంచి ఎన్నో కథలు,కావ్యాలు రాసి దాని గొప్పతనాన్ని తెలిపారు. అయితే ఈవయసుకలోనైనా స్నేహం ఒకేలా ఉంటుంది. కష్టం వచ్చిందంటే ముందుగా స్పందించేది.. సాయం చేయడానికి ముందుకు వచ్చేది స్నేహితులే.. ఇందుకు నిదర్శనంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.. తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకు ఆ వేడియాలో ఏముందంటే..
ఈ వీడియోలో ఓ చిన్నారి ఇల్లు ప్రమాదంలో కాలిపోయింది. ఇల్లు మొత్తం అగ్నికి ఆహుతయిపోయింది. అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు. అయితే ఆ చిన్నారి ఆదుకునే బొమ్మలు కూడా కాళీ బూడిదైపోయాయి. విషయం తెలుసుకున్న ఈ చిన్నారి స్కూల్ ఫ్రెండ్స్ అందరు కలిసి అతడి కోసం బొమ్మలు కొన్నారు. క్లాస్‌లో బొమ్మలన్నీ ఉంచి అతడికి సర్ ప్రైజ్ ఇచ్చారు. దాంతో ఈ చిన్నారి సంతోషంతో ఎమోషనల్ అయ్యాడు. ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకోవాలి ఉంది అని కోరాడు. అంతే ఆ చిన్న పిల్లలంతా కలిసి అతడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో కన్నీరు పెట్టిస్తుందని కొందరంటుంటే మరికొంతమంది ఫ్రెండ్ షిప్ కు అసలైన ఉదాహరణ అంటూ కామెంట్ చేస్తున్నారు. “అతడు ఆ బొమ్మలను కనీసం ముట్టుకోకుండా ఓ హగ్ కావాలని అడిగాడు” నిజంగా సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :