AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సూపర్ స్టంట్.. నీటి నుంచి ఎగిరి పండ్లను అందుకుని.. క్రేజీ ఫిష్

ఫిష్.. ప్రపంచంలోని చాలా జీవులకు చాలా ఫేవరెట్ ఫుడ్. పక్షులు కూడా చేపలను చాలా ఈజీగా ట్రాప్ చేస్తాయి. పాపం అమాయకంగా వలలో చిక్కే జీవులు ఉన్నాయంటే అవి చేపలే.

Viral Video: సూపర్ స్టంట్.. నీటి నుంచి ఎగిరి పండ్లను అందుకుని.. క్రేజీ ఫిష్
Fish Eating Fruits
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2021 | 6:15 PM

Share

ఫిష్.. ప్రపంచంలోని చాలా జీవులకు చాలా ఫేవరెట్ ఫుడ్. పక్షులు కూడా చేపలను చాలా ఈజీగా ట్రాప్ చేస్తాయి. పాపం అమాయకంగా వలలో చిక్కే జీవులు ఉన్నాయంటే అవి చేపలే. చేపలతో ఎలాంటి వంటలు చేయొచ్చు.. ఏఏ ఏరియాల్లో ఎలాంటి రెసిపీస్ దొరుకుతాయి లాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం చాలామంది సమాధానం చెబుతారు. కానీ చేపల బ్యూటీని వర్ణించమంటే మాత్రం చాలామంది నోరెళ్లబెడతారు. ఆవురావురుమంటూ పులుపు, ఫ్రై, పచ్చడి చేసుకుని తినడం తప్ప.. తీక్షణంగా వాటి సౌందర్యాన్ని గుర్తించేవారు ఎవరుంటారు చెప్పండి. అందుకే మీ ముందుకు ఓ వీడియోను తీసుకొచ్చాం. ఈ వీడియోలో చేప చాలా అందంగా కనిపిస్తోంది. ఆహారం కోసం అది చేసిన స్టంట్ అదరహో అనిపిస్తోంది. వయ్యారాలు పోతూ అది నీటిలో నుంచి పైకి రావడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. వీడియోపై ముందుగా ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Kiren Rijiju (@kiren.rijiju)

చూశారు చేప స్టంట్. ఆకలి ఎలాంటి ఆటలైనా ఆడిస్తోంది. ఎన్నో పోరాటాలను నేర్పిస్తోంది. వీడియోలో ఓ చేప ప్రవాహానికి ఎదురుగా వెళ్లడం మీరు చూడవచ్చు. అనంతరం చేప.. నీటి నుంచి గాలిలోకి ఎగిరి ఓ కొమ్మకు ఉన్న పండ్లను అందుకుంటుంది. ఈ సూపర్ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిరిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రకృతిని గౌరవించండి, సహజ సౌందర్యాన్ని ఆస్వాదించండి. చేపలను ఆహారంగా మాత్రమే చూడకండి!’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

Also Read: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని

 ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు