AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak: పాక్ గెలిచిందని భార్య ఆనందం.. పోలీసులకు భర్త కంప్లైంట్.. కేసు నమోదు

ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ ఘోర పరాజయం చవిచూసింది.

Ind vs Pak: పాక్ గెలిచిందని భార్య ఆనందం.. పోలీసులకు భర్త కంప్లైంట్.. కేసు నమోదు
UP Man Files Police Case Against Wife
Ram Naramaneni
|

Updated on: Nov 06, 2021 | 9:33 PM

Share

ఇండియా, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లో టెన్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్​ ఘోర పరాజయం చవిచూసింది. ఈ విషయాన్ని టీమ్​ఇండియా ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమికి కొందరు ఆటగాళ్లను బాధ్యులను చేస్తూ ట్రోలింగ్ జరుగుతోంది. ఇక భారత్ వీరాభిమానుల వేదను వర్ణించ వీలులేనింది. అయితే ఉత్తర్​ప్రదేశ్​ రామ్​పుర్​లో ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్​కు మద్దతు తెలిపిన భార్యపై పోలీసులకు కంప్లైంట్ చేశాడో వ్యక్తి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల అక్టోబరు 24న ఇండియా​-పాకిస్థాన్​ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్​ మ్యాచ్​లో భారత్​పై పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ సమయంలో ఢిల్లీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్​ చూసిన ఇషాన్​ మియాన్​ అనే వ్యక్తి మిగతా భారత అభిమానుల్లానే చాలా డిసప్పాయిండ్ అయ్యాడు. అదే సమయంలో తన వాట్సాప్​ చూడగా.. అందులో పాక్​ గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య స్టేటస్​ కనిపించింది.

దీంతో ఇషాన్​ మియాన్ కోపంతో రగిలిపోయాడు. భార్య ప్రవర్తనను సహించలేక​ రామ్​పుర్​ ఎస్​పీని కలిసి ఈ విషయంపై కంప్లైంట్ చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. భారత్​పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రబియా స్టేటస్​ ఆధారంగా పోలీసులు సెక్షన్​ 153ఏ, 66 కింద కేసు ఫైల్ చేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్​ చేస్తామని పోలీసులు తెలిపారు.

Also Read:  తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని

ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ అరెస్ట్.. అతి చేస్తే ఇంతే.. పూర్తి వివరాలు

Follow Us
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?