Watch Video: నెట్టింట వైరల్ అవుతున్న ‘కళియుగ అభిమన్యుడు’.. పాలు తాగే వయసులోనే శ్లోకాలను పలుకుతున్న చిన్నారి..
అభిమన్యుడు కడుపులో ఉండి పద్మవ్యూహం గురించి నేర్చుకున్నట్లుగానే ఇప్పుడు ఓ చిన్నారి పాలు తాగే వయసులోనే సంస్కృత శ్లోకాలను వల్లిస్తున్నాడు. తన తల్లి చెప్తున్నశ్లోకాలను ఎంతో ఆసక్తిగా వింటూ వాటిని పలికే..

దాదాపుగా మనందరికీ ‘మహాభారతంలో అభిమన్యుడు’ గురించి తెలుసు. శ్రీకృష్టుడి చెల్లెలయిన సుభద్ర-గాంఢీవధారి అర్జునుడి కొడుకే అభిమన్యుడు. తల్లి కడుపులోనే అభిమన్యుడు తన తండ్రి అర్జునుడు చెబుతున్న పద్మవ్యూహం గురించి విని నేర్చుకుంటాడు. అయితే సుభద్ర చేసిన చిన్న తప్పు(అప్పుడు నిద్రపోవడం) కారణంగా పద్మవ్యూహం నుంచి ఎలా బయటకు రావాలో తెలియక కురుక్షేత్ర యుద్ధంలోని 8వ రోజు కౌరవుల చేతుల్లో మరణిస్తాడు. అయితే అభిమన్యుడు కడుపులో ఉండి పద్మవ్యూహం గురించి నేర్చుకున్నట్లుగానే ఇప్పుడు ఓ చిన్నారి పాలు తాగే వయసులోనే సంస్కృత శ్లోకాలను వల్లిస్తున్నాడు.
తన తల్లి చెప్తున్నశ్లోకాలను ఎంతో ఆసక్తిగా వింటూ వాటిని పలికే ప్రయత్నం చేస్తున్న ఆ చిన్నారి వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారంటే అతిశయోక్తి కానేకాదు. వారిలోని కొందరు అయితే ఈ చిన్నారిని ‘కళియుగ అభిమన్యుడు’ అని అభివర్ణిస్తున్నారు. సాధారణంగా అయితే చిన్న పిల్లలు మాటలు నేర్చుకునేటప్పుడు చాలా కష్ట పడుతుంటారు. కానీ ఈ వీడియోలోని చిన్నారి ఎంతో కష్టమైన సంస్కృత శ్లోకాలను సునాయాసంగా పలుకుతున్నాడు.




వైరల్ అవుతున్న వీడియో..
This little baby is able to complete shlokas that her mother recites. Astounding.
A friend sent this video to me. pic.twitter.com/5XHgpKgyal
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) December 12, 2022
కాగా చాలా మంది నెటిజన్ల ప్రకారం ఆ పిల్లవాడికి ‘పుంసవన్ సంస్కార్(ఏకసంతగ్రాహి)’ ఉంది. అందుకే ఆ చిన్నారి అలా చేయగులుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్ డిఫెన్స్ అధికారి మేజర్ గౌరవ్ ఆర్య తన ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 12వేలలకు పైగా లైకులు, ఇంకా 1789 రీట్వీట్‌లు వచ్చాయి. ఇక ఈ వీడియోకు నెటిజన్లు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆ క్రమంలోనే నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..