Lion Vs Leopard: ఆధిపత్యం కోసం ఏకంగా సింహంతోనే.. రసవత్తరమైన పోరాటం.. వీడియో వైరల్
అడవిలో జీవనం అంటే శక్తివంతమైన పోరాటం. సింహాలు, చిరుతపులులు వంటి పెద్ద పిల్లులు (Big Cats) తరచుగా ఒకదానితో ఒకటి తమ ఉనికి కోసం, ఆహారం కోసం పోరాడుతాయి. సింహాన్ని అడవి రాజుగా పరిగణించినప్పటికీ, చిరుతపులి తన చురుకుదనం (Agility), వేగం కారణంగా శక్తివంతమైన ప్రత్యర్థిగా నిలుస్తుంది. తాజాగా, ఒకే ఆహారం కోసం సింహం, చిరుతపులి మధ్య జరిగిన భీకర యుద్ధంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ పోరాటం ఎంత ప్రమాదకరంగా జరిగిందో, చివరికి ఎవరు గెలిచారో ఈ వీడియోలో చూడవచ్చు.

సింహాలు, చిరుతపులులు ఒకదానికొకటి ఎదురైనప్పుడు, అవి ప్రాణాలను కాపాడుకోవడానికి, చంపుకోవడానికి ప్రయత్నిస్తాయి. అడవిలో అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన ఈ రెండు జంతువులు తలపడితే, ఆ యుద్ధం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా వేటాడే విషయానికి వస్తే సింహం మరింత శక్తివంతమైంది, కానీ చురుకుదనం విషయంలో చిరుతపులికి పోటీలేదు. మరి ఈ రెండూ తలపడితే ఏం జరిగిందో చూడండి..
వైరల్ వీడియోలో కనిపించే దృశ్యం చాలా భిన్నంగా ఉంది. రెండూ ఒకే వేట పీఠంపై ఉన్నాయి. ఈ భీకర పోరాటం ఒక సింహం, చిరుతపులి మధ్య ఆహారం కోసం జరుగుతోంది. వీడియోలో సింహం చిరుతపులి కంటే చాలా బలంగా ఉంది. అయితే, చిరుతపులి దాని చురుకుదనం కారణంగా సింహం దాడుల నుండి తప్పించుకుంటుంది.
సింహం, చిరుతపులి ఆహారం కోసం పోరాడుతుండగా, ఆ భీకర పోరాటం కారణంగా చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న చిరుతపులి, తక్షణమే అక్కడ నుండి పారిపోయి, తన ప్రాణాలను కాపాడుకుంది. పోరాటంలో చిరుతపులి తప్పించుకోవడంతో, ఆ ఆహారానికి యజమాని సింహమే అని తేలింది.
That leopard bounced off the floor like a ping pong ball 😂 pic.twitter.com/qa53zp7uvP
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 15, 2025
ఈ వైరల్ వీడియోను @AMAZlNGNATURE అనే ఖాతా నుండి పంచుకున్నారు. ఈ వీడియోను 10 లక్షలకు పైగా వీక్షించారు. ఈ దృశ్యంపై ప్రజలు తమ స్పందనలను పంచుకుంటున్నారు.
