భారీ మొసలిని భుజాలపై మోస్తూ.. రియల్ బాహుబలి
8 అడుగుల మొసలి రాజస్థాన్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో వాళ్లు షాకై బయటకు పరుగులు తీసారు. కోటా జిల్లాలో శుక్రవారం రాత్రి ఘటన జరిగింది. బంజారి గ్రామంలో 80 కిలోల మొసలి ఓ ఇంట్లోకి ప్రవేశించింది. కుటుంబ సభ్యులంతా టీవీ చూస్తుండగా ఆహ్వానం లేని అతిథిలా భారీ ఆకారంతో మొసలి ఇంట్లోకి దూసుకురావడంతో ఇంటిల్లిపాది భయంతో అరుపులు, కేకలు పెడుతూ పరుగులు తీశారు.
వెంటనే ఫారెస్ట్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. గంటలు గడుస్తున్నా అధికారులు రాకపోవడంతో వన్యప్రాణి సంరక్షకుడు హయత్ ఖాన్‌కు సమాచారం అందించారు. హయత్, అతని బృందం వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మొసలి నోటికి టేపు వేసి, కాళ్లకు తాళ్లు కట్టి దాడి చేయకుండా బంధించారు. మొసలిని బంధించేందుకు గంట తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అనంతరం హయత్ ఖాన్ ఆ మొసలిని తన భుజాలపై ఎత్తుకుని తీసుకువెళ్లాడు.. అతను అలా మొసలిని ఎత్తుకుని వీధుల్లో నడుస్తుంటే జనం చప్పట్లతో మార్మోగించారు. ఇదంతా ఏదో సినిమాలో హీరోను మించి కనిపించింది. మొసలిని తిరిగి చెరువు వద్ద వదలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి
బిగ్‌బాస్‌లోకి దివ్వల మాధురి.. అందుకే భర్తతో విడిపోయా
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

