లక్ అంటే ఇదీ.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన జాలరి
అదృష్టం కలిసొచ్చి.. రాత్రికి రాత్రి లక్షాధికారులైన వారిని మీరు చూసుంటారు. గొప్పగా బతికి పరిస్థితి తలకిందులై బిచ్చగాళ్లుగా మారిన వారి గురించీ వినే ఉంటారు. అదృష్టం ఒక్కోసారి పడిశం పట్టినట్లు పడుతుందని పెద్దలు చెప్పిన మాట.. ఈ మత్స్యకారుడి విషయంలో నిజమైంది. సముద్రంలో వేటకు వెళ్లిన అతని వలలో అత్యంత అరుదైన చేపలు పడటంతో.. మనోడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడై పోయాడు.
ఆరోగ్యానికి మేలు చేస్తాయనే పేరున్న రూ. కోటి విలువైన 90 భోలా చేపలు అతడి వలలో పడటంతో అతడి దశ తిరిగిపోయింది. ఒడిశా -పశ్చిమ బెంగాల్ సరిహద్దు వెంబడి దిఘా సమీపంలోని బంగాళాఖాతం ముఖద్వారం వద్ద చేపలు పడుతుండగా ఒక మత్స్యకారుడు 90 భారీ తెలియా భోలా చేపలను పట్టుకున్నాడు. అవి ఒక్కో చేప 30 నుండి 35 కేజీల బరువు ఉండగా, వేలంలో అవన్నీ కలిపి.. దాదాపు రూ.1 కోటి ధర పలికాయి. దిఘా చేపల మార్కెట్ వద్ద ఒకేసారి పెద్ద మొత్తంలో లభించిన ఈ అరుదైన చేపలను చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.కోల్‌కతాకు చెందిన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ మొత్తం 90 చేపలను కొనుగోలు చేసింది. వాటిలోని అధిక ఔషధ, వాణిజ్య విలువల కారణంగా ఈ చేపలను కొనుగోలు చేసిందని వర్గాలు తెలిపాయి. ఈ చేప నూనె, ఇతర ఉత్పత్తులు పలు రోగాల నివారణలో బాగా పనిచేస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్‌బాస్‌లోకి దివ్వల మాధురి.. అందుకే భర్తతో విడిపోయా
చుక్కలు చూపించనున్న చలి20 డిగ్రీలకు పడిపోనున్న టెంపరేచర్
అర్ధరాత్రి దొంగల బీభత్సంఆ ఇళ్లే టార్గెట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

