AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

తండ్రి ఆశయం కోసం IPS సాధించిన ఫారిన్ విద్యార్థిని

Phani CH
|

Updated on: Oct 15, 2025 | 6:54 PM

Share

దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో UPSC ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు సివిల్ సర్వెంట్ కావాలనే కలతో ఈ పరీక్షకు హాజరవుతారు, కానీ కొద్దిమంది మాత్రమే తమ లక్ష్యాన్ని సాధిస్తారు.వారిలో ఫరీదాబాద్‌కు చెందిన IPS సృష్టి మిశ్రా కూడా ఒకరు. ఆమె విదేశాలలో చదువుకుని, భారతదేశానికి తిరిగి వచ్చి, తన రెండవ ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై, 95వ ర్యాంకును సాధించింది.

సృష్టి మిశ్రా విద్యకు విలువనిచ్చే కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆదర్శ్ మిశ్రా, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీ. తల్లి గృహిణి. సృష్టి ప్రాథమిక విద్య దక్షిణాఫ్రికాలో జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. IPS అధికారిణి కావడానికి సృష్టి ప్రయాణం అంత సులభం కాదు. తన మొదటి ప్రయత్నంలోనే ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయితే ఆమె నిరాశ చెందలేదు. తన తండ్రి మార్గదర్శకత్వంలో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమైంది. తండ్రి కలను నెరవేర్చడానికి ఆమె రోజుకు 8-10 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించింది. రెండవ ప్రయత్నంలో ఆల్ ఇండియాలో 95వ ర్యాంక్ సాధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సృష్టి మిశ్రాను ఉత్తరప్రదేశ్ కేడర్‌కు కేటాయించింది. అంటే శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఆమె తన సొంత రాష్ట్రానికి సేవ చేయనుంది. సృష్టి తన రాష్ట్రానికి సేవ చేయడం పట్ల ఉత్సాహంగా ఉందని చెప్పింది. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఆసక్తిగా ఉందని తెలిపింది. సృష్టి మిశ్రా పట్టుదల విజయగాథ అనేక మంది యువతకు ఆదర్శంగా నిలస్తుందని పలువురు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహావతార్‌లాగే.. కురుక్షేత్ర మూవీ OTTలో తప్పక చూడాల్సిందే

Srija: ఆయనే అలా చేస్తే ఎలా ?? సోషల్ మీడియాలో చర్చ

యూరప్ లో ప్రభాస్ ది రాజాసాబ్ సాంగ్ షూట్

ఆ విషయం లో పవన్‌ను ఫాలో అవుతున్న మలయాళ స్టార్‌

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా