Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా

అందాల భామల టాలీవుడ్ రీఎంట్రీ.. సెకండ్ ఛాన్స్ తో అయిన సత్తా చూపుతారా

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Oct 15, 2025 | 6:11 PM

Share

ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన అందాల భామలు ఈ మధ్య కెరీర్‌లో కాస్త తడబడ్డారు. కానీ షార్ట్‌ గ్యాప్ తరువాత మరింత గ్లామరస్ అవతార్‌లో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీస్‌.. వాళ్ల కిట్టీలో ఉన్న ఆ మూవీస్‌ ఏంటి..? తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఫాలో దిస్ స్టోరి,. ఒకప్పుడు ఇంట్రస్టింగ్ క్యారెక్టర్స్‌తో టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసిన రాశీఖన్నా.. తరువాత నెమ్మదిగా ఫేడవుట్ అయ్యారు.

అదర్‌ లాంగ్వేజెస్‌ మీద ఎక్కువగా ఫోకస్ చేయటంతో తెలుగు తెరకు దూరమయ్యారు. అయితే ఇతర భాషల్లో అనుకున్న రేంజ్‌ క్రేజ్ రాకపోవటంతో మళ్లీ మన సినిమా వైపు చూస్తున్నారు ఈ బ్యూటీ. అప్‌ కమింగ్ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వస్తానని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో పాన్ ఇండియా రేసులో పోటి పడ్డ పూజ హెగ్డే తరువాత తడబడ్డారు. వరుస ఫెయిల్యూర్స్‌ అమ్మడి కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. దీంతో టాలీవుడ్‌లో ఛాన్సులు కరువయ్యాయి. ఇంత టఫ్‌ సిచ్యుయేషన్స్‌ను పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసిన పూజ, టాలీవుడ్‌లో తిరిగి ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. దుల్కర్‌కు జోడీగా నటిస్తున్న సినిమాతో పాటు మరో బిగ్ ప్రాజెక్ట్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు పూజ. టాలీవుడ్ ఎంట్రీ కోసమే చాలా కాలంగా ఎదురుచూస్తున్న మాళవిక మోహనన్‌ కూడా అప్‌ కమింగ్ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. డార్లింగ్‌కు జోడీగా తెలుగు తెరకు పరిచయం అవుతుండటంతో గ్రాండ్ వెల్ కం గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు. మరి ఈ అందాల భామలకు కెరీర్‌లో ఆశించిన టర్న్ వస్తుందా..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాన్ ఇండియా ట్రెండ్ లో పెరిగిన గ్రాఫిక్స్ వాడకం

NTR మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తారా..?

అనుమానాలకు చెక్‌ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..

Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్‌ మాటలతో సెట్ చేసి పడేసిందిగా

Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??

Published on: Oct 15, 2025 06:09 PM