అనుమానాలకు చెక్ పెడుతూ.. బరిలోకి దిగనున్న వెంకీ..
సూపర్ హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి కెప్టెన్సీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆ అంచనాలను డబుల్ చేసే మరో న్యూస్ ఒకటి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. వెంకటేష్‌తో వందకోట్ల సినిమా చేసిన అనిల్, చిరుతో అంతకు మించి సక్సెస్‌ను కొట్టడం ఖాయం అని ఫిక్స్ అయ్యారు. ఫ్యాన్స్ జోష్‌ను మరింత పెంచేలా చిరు సినిమాకు మరో సక్సెస్ సెంటిమెంట్‌ను యాడ్ చేస్తున్నారు. అనిల్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సక్సెస్‌లు ఇచ్చిన వెంకీ, చిరు సినిమాలోనూ భాగం కాబోతున్నారు. ఈ న్యూస్ చాలా రోజులుగా ట్రెండ్ అవుతున్నా, వెంకీ షూటింగ్‌లో జాయిన్ కాకపోవటంతో అసలు గెస్ట్ రోల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ రెయిజ్.ఇప్పుడు అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ మెగా మూవీ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు విక్టరీ హీరో. అక్టోబర్ 21 నుంచి చిరు, వెంకీ కాంబో సీన్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అనిల్. అంతేకాదు ఈ సినిమాలో వెంకీ క్యారెక్టర్ అనిల్ మార్క్ ఫన్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండబోతుందంటూ ఊరిస్తున్నారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ఇవ్వని నాకు జుజుబీ.. సెటైరికల్ మాటలతో సెట్ చేసి పడేసిందిగా
Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
ప్రపంచంలోనే 'లాంగెస్ట్' ఫ్లైట్ చూసారా..
నెలకు రూ. 8 వేలు జీతం.. కానీ రూ.13 కోట్ల జీఎస్టీ నోటీసు అందుకుంది
ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..
యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..
మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్..
హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

