Alia Bhatt: నెరవేరనున్న అలియా కల.. మరి తన నటనతో ఫ్యాన్స్ ను మెప్పిస్తారా ??
అప్పుడు త్రిప్తికి దక్కిన ఛాన్స్ ఇప్పుడు ఆలియాకు దక్కుతోందని మాట్లాడుకుంటోంది ఇండియన్ సినీ ఇండస్ట్రీ. డార్లింగ్ ప్రభాస్‌తో నటించాలనే కోరిక నాయికలకు అందరికీ ఉంటుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆలియా డ్రీమ్ నెరవేరే సందర్భం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. నిజంగానే అది వర్కవుట్ అవుతుందా? ప్రభాస్‌తో దీపిక మరోసారి నటించబోతున్నారు.
కల్కిలో స్క్రీన్ మీద హల్‌చల్ చేసిన ఈ జోడీని స్పిరిట్ కోసం మళ్లీ చూడబోతున్నాం అని అనుకున్నారు జనాలు. అయితే స్పిరిట్ నుంచి దీపిక వెళ్లడం.. ఆ ప్లేస్‌కి త్రిప్తి దిమ్రి సెలక్ట్ కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. యానిమల్‌లో చోటా బాబీగా నటించిన త్రిప్తికి ఇంత రేంజ్ ఉన్న కేరక్టర్ ఇచ్చారంటే సందీప్ గట్స్ సూపర్ అని మెచ్చుకున్నారు చాలా మంది. దీపికను త్రిప్తి రీప్లేస్ చేసిన వార్త అప్పట్లో హాట్ టాపిక్. అది కాస్తా చల్లారేలోపే దీపిక గురించి మరో వార్త బయటకు వచ్చేసింది. అదే కల్కి2లో ఆమె లేరని. కల్కి ఫస్ట్ పార్టులో సుమతి కేరక్టరే మెయిన్. సెకండ్ పార్టులోనూ ఆమె కేరక్టర్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటప్పుడు ఆమెను రీప్లేస్ చేసే వాళ్లు ఎవరున్నారు? అనే చర్చ షురూ అయింది. సందీప్ చెప్పినట్టు వెంటనే తమ హీరోయిన్‌ని డిక్లేర్ చేయలేదు నాగ్ అశ్విన్. దాంతో కల్కి2 లో నటించే అవకాశాలు ఎవరెవరికి ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా ఈ లిస్టులో ఆలియా పేరు గట్టిగా వినిపిస్తోంది. తన ప్రాజెక్టుకి ఆలియా పర్ఫెక్ట్ అని నాగీ ఫిక్సవుతున్నట్టు టాక్ నడుస్తోంది. అదే నిజమైతే దీపికను మరపించాల్సిన బాధ్యత ఆలియాపై ఉన్నట్టే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ??
నదిలో శివలింగం, నంది దర్శనం.. శివయ్యే వచ్చాడంటూ
వంటచేసేందుకు కిచెన్‌లోకి వెళ్లిన మహిళ.. అక్కడ సీన్ చూసి షాక్
మన ఖర్మ బాగాలేకపోతే.. ఇంతేనేమో ??
వామ్మో...అక్కడికెలా వెళ్లావురా సామీ !!
రూ.20 వేలా ?? ఐఫోన్ పౌచ్‌పై ట్రోలింగ్
దెయ్యాన్ని చూసి భయపడిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..

