AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి కుక్క రా బాబోయ్.. బిత్తరపోయిన చిరుత.. వీడియో వైరల్

అడవి జంతువులు మధ్యకు రోబో కుక్కను పంపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి..? అవేంటో తెలియక జంతువులు ఆగమాగమవుతాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పటికే 3 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. మీరూ ఆ వీడియోను చూసేయండి..

Viral Video: ఇదెక్కడి కుక్క రా బాబోయ్.. బిత్తరపోయిన చిరుత.. వీడియో వైరల్
Leopard Vs Robot Dog Viral Video
Krishna S
|

Updated on: Sep 21, 2025 | 11:42 AM

Share

ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల ఒక చిరుత, రోబో కుక్క మధ్య జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రకృతికి, ఆధునిక సాంకేతికతకు మధ్య జరిగిన ఈ అరుదైన ఘర్షణ లక్షలాది మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

రోబో కుక్కను చూసి అవాక్కైన చిరుత..

ఈ వీడియోలో ఒక చిరుత నది ఒడ్డున ప్రశాంతంగా తిరుగుతూ ఉంది. సడెన్‌గా అక్కడ ఒక రోబో కుక్క ప్రత్యక్షమైంది. ఈ వింతైన లోహపు జీవిని చూసి చిరుత ఆశ్చర్యపోయింది. అది ఏమిటో అర్థం కాని స్థితిలో రోబో వైపు కొద్దిసేపు చూస్తూ ఉండిపోయింది. ఆ చిరుత ముఖంలో కనిపించిన గందరగోళం, ఆశ్చర్యం ఈ వీడియోను మరింత ఆసక్తికరంగా మార్చాయి.

మిలియన్ల వ్యూస్

ఈ చిన్న వీడియోను ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @naturegeographycom షేర్ చేసింది. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన లభించింది. ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా వ్యూస్, దాదాపు 34,000 లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

ప్రశాంతంగా ఉండనివ్వండి

ఒక నెటిజన్ “ఈ రోబో కుక్కను సింహం దగ్గరకు తీసుకువెళ్ళండి. అప్పుడు మరింత ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది” అని కామెంట్ చేశారు.అయితే మరికొందరు ఈ చర్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అడవి జంతువులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు..? వాటిని వాటి ప్రపంచంలో ప్రశాంతంగా ఉండనివ్వండి” అని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియో ఆధునిక సాంకేతికత అడవిలోకి ప్రవేశించినప్పుడు జంతువుల స్పందన ఎలా ఉంటుందో చూపించి చర్చకు దారి తీసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.