Viral Video: ఇద్దరు యువకులు కష్టపడినా పగలని కుండ.. కుమ్మరి ఏదో కుట్ర పన్నినట్లుందంటూ ఫన్నీ కామెంట్స్
ఈ కుండని అంబుజా సిమెంట్ తో తయారు చేసారా అంటూ కామెంట్ జత చేశారు. కేవలం 30 మంది ఉన్న ఈ వీడియో ఇప్పటివరకు 25 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.
Viral Video: కృష్ణ జన్మాష్టమి పండుగను దేశ విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కృష్ణాష్టమిని కొందరు ఆగష్టు 18న, మరికొందరు ఆగష్టు 19న జరుపుకున్నారు. అయితే ఉట్టి కొట్టే పండగను జన్మాష్టమి మరుసటి రోజు జరుపుకుంటారు. ఉట్టి కొట్టడం మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యంత ప్రసిద్ధి చెందినప్పటికీ.. ప్రస్తుతం కృష్ణాష్టమి వేడుకల్లో ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం దేశ వ్యాప్తంగా సర్వసాధారణంగా మారిపోయింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఈ ఉట్టి కొట్టే కార్యక్రమం చూడవచ్చు. కుండను పగలగొట్టడానికి యువకులు పడుతున్నకష్టానికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కుండను పగలగొట్టడానికి విశ్వప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ కుండ పగలలేదు.
ముందుగా ఓ యువకుడు కుండను పగలగొట్టేందుకు ప్రయత్నించడాన్ని వీడియోలో చూడవచ్చు. అతను కొబ్బరికాయతో 4 సార్లు కుండలు పగల గొట్టడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ కుండా చెక్కు చెదరలేదు. దీని తరువాత, మరొక యువకుడు కుండను పగలగొట్టరానికి రంగంలోకి దిగి.. తన వంతు ప్రయత్నం మొదలు పెట్టాడు. మొదట ఉన్న యువకుడి చేతి నుంచి కొబ్బరికాయను తీసుకుని తాను కుండను పగలగొట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. అయినప్పటికీ అసలు ఆ కుండ పగలేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ये अंबुजा सीमेंट है, विराट कॉम्प्रेसिव स्ट्रेंथ ?#Govindas #Janmashtami#happyjanmashtamipic.twitter.com/UokU2g5a0u
— Gaurav Agrawal (@GauravAgrawaal) August 19, 2022
ఈ ఫన్నీ వీడియో గౌరవ్ అగర్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ కుండని అంబుజా సిమెంట్ తో తయారు చేసారా అంటూ కామెంట్ జత చేశారు. కేవలం 30 మంది ఉన్న ఈ వీడియో ఇప్పటివరకు 25 వేలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. నెటిజన్లు రకరకాల ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. కుండా లేక రాయా అని ఒకరు కామెంట్ చేస్తే.. ‘తల పగులుతుందేమో కానీ కుండ పగిలిపోదు’ అని రాశారు. మరొకరు.. తమాషాగా వ్యాఖ్యానిస్తూ, ‘కుమ్మరి ఏదో కుట్ర పన్నినట్లుంది’ అని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..